11 మంది మాఫియా లీడర్ల కోసం యూపీ పోలీసుల వేట-యోగీ సర్కార్ ఆదేశాలతో...
యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరస్తులపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేసిన 11 మంది కరడు గట్టిన మాఫియా లీడర్లపై చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ విజయ్ కుమార్ పోలీసు కమిషనర్లు, ఎస్ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో త్వరలో వీరిని మట్టుపెట్టేందుకు పోలీసులు పావులు కదుపుతున్నారు.
రాష్ట్రంలో సంచరిస్తున్న అతి భయంకరమైన కరడుగట్టిన 11 మాఫియా నేతలపై చర్యలు తీసుకోవాలంటూ యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ అన్ని పోలీసు కమిషనర్లు, ఎస్ఎస్పీలకు లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో మాఫియాలను కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సిద్ధమయ్యారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ విధానం ప్రకారం మాఫియాలను మట్టుబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు.

యూపీ డిజిపి ఇటీవల రాష్ట్ర క్రైమ్ గ్రాఫ్‌ను సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో మరియు ఇప్పటివరకు వదిలేసిన 11 భయంకరమైన మాఫియా లీడర్ల జాబితా సిద్ధం చేశారు. నేరాలు, నేరస్థుల పట్ల యూపీ ప్రభుత్వం జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. వీరి పట్ల నిర్లక్ష్యంగా ఉండటంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు ఇచ్చారు.
11 మంది మాఫియా నేతలు యూపీలోని 61 మంది భయంకరమైన నేరస్థుల జాబితాలో ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ 11 మందిని మినహాయించి ఎక్కువగా కటకటాల వెనుక ఉన్న మిగిలిన వారిపై చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన వినయ్ త్యాగి అలియాస్ టింకూ పరారీలో ఉన్న నేరస్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే పశ్చిమ యూపీకి చెందిన భయంకరమైన గ్యాంగ్‌స్టర్ త్యాగి యూపీతో పాటు పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లోని అనేక నగరాల్లో 32 హత్యలు, హత్యాయత్నం, మోసం, కిడ్నాప్, ఇతర కేసులలో నిందితుడిగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications