Rat: ఎలుకను చంపిన కేసులో ఛార్జిషీట్ ఫైల్ చేసిన పోలీసులు..
మనుషులనే కాదు.. ఎలుకలను చంపిన శిక్ష పడుతుందని తెలిసా... అవును ఓ వ్యక్తి ఎలుకతో క్రూరంగా వ్యవహరించి, దాని మరణానికి కారణమయ్యాడు. దీంతో అతనిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖల్ చేశారు. ఎలుక పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్టు, వీడియోలు, వివిధ విభాగాలు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్ దాఖలు చేశారు.
చనిపోయిన ఎలుక ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి, ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. 2022లో నవంబర్‌లో మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఎలుక తోకకు రాయి కట్టి మురుగు కాల్వలోకి పడేశాడు.

ఇది చూసిన జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతువు పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించానని, అయితే అది అప్పటికే చనిపోయిందని తెలిపాడు. ఈ క్రమంలోనే పోలీసులు కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 429తోపాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చనిపోయిన ఎలుకకు పోస్టు మార్టం నిర్వహించారు. ఎలుక కళేబరాన్ని మొదటగా బదాయూలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా వారు నిరాకరించారు. అనంతరం దాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్‌ఐ)కు తరలించారు.
పోస్టుమార్టం చేసిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఎలుక చనిపోయినట్లు తేల్చారు. దీంతో యూపీ పోలీసులు తాజాగా బదాయూ కోర్టులో నిందితుడిపై 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు ఫైల్ చేశారు. కుమార్ మట్టి పాత్రలను ఎలుకలు పాడు చేశాయని అతని తండ్రి చెప్పాడు. కుమార్ మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడని తెలిపాడు. ఒక వేళ ఈ కేసులో కుమార్ దోషిగా తేలితే జంతు హింస నిరోధక చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications