దారి ఇవ్వలేదని కాల్చి చంపిన ఎమ్మెల్యే సోదరుడు
లక్నో: తమ వాహనం ముందుకు వెళ్లేందుకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు ఓ వ్యక్తిని కాల్చి చంపిన దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే జగ్‌రామ్ పాశ్వాన్ న్ సోదరులు అన్నూ యాదవ్, పప్పు పాస్వాన్.
వీరు తమ బంధువు అంగద్‌తో కలిసి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. ఈ సందర్భంగా ధనేపూర్ ప్రాంతంలో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని దాటి వెళ్లడానికి ఎమ్మెల్యే సోదరులు చాలాసేపు విఫలమయ్యారు.

ఆ తర్వాత ఎట్టకేలకు ముందు వెళ్తున్న వాహనాన్ని దాటుకొని వెళ్లారు. ఆ తర్వాత ముదు వెళ్తున్న వాహనంలో ఉన్నవారితో గొడవ పడ్డారు. అనంతరం అన్నూ కాల్పులు జరపడంతో... జైరామ్ యాదవ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అన్నూను సోమవారం అరెస్టు చేశారు. పప్పు, అంగద్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications