Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్-యువ ఎంపీ తేజస్వీ సూర్య మధ్య ట్విటర్ వార్.. ఏ దానిపై ఈ గొడవ..?

ఉత్తర్ ప్రదేశ్‌లో ఇప్పటికే రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఆయా పార్టీల్లో ఏ మాత్రం వేడి తగ్గలేదు. ఇక మూడవ దశ ఎన్నికలు ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వేడి మరింత పెరిగింది. యువనాయకులు తమ నోళ్ళకు పనిచెబుతున్నారు. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలే చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్ చేసిన ఓ పోస్టుపై కౌంటర్ ఇచ్చారు సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. తేజస్వీ సూర్య గురువారం ఉదయం ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై ఓ వీడియోను ట్వీట్‌ చేశాడు. దీనికి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. లక్నో నుంచి కనౌజ్‌ వరకు యోగీ చేసిన అభివృద్ధి ఇదీ అని పేర్కొనే వీడియోను పోస్టు చేశారు. ఈ మధ్యే ట్రెండ్ అయిన పదం ఉప్‌యోగీ హై యోగీ అంటూ హ్యాష్ ట్యాగ్‌ కూడా ఇచ్చాడు. ఇక ఈ ట్వీట్ చూసిన అఖిలేష్ యాదవ్ తన స్టయిల్‌లో కౌంటర్ ఇచ్చారు.

బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్ చేసిన పోస్టుకు అదే సైటైర్ వేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. "లాంతరు కింద చీకటి ఉంటుందని విన్నాను. బీజేపీ నాయకులను చూసి అది నిజమే అనిపిస్తోంది. అందుకే సూర్య అంటే సూర్యుడి వెనక ఉన్న చీకటి" అని చెప్పొచ్చంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. అంతేకాదు తేజస్వీ సూర్య ట్వీట్ చేసిన పోస్టుపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను పోస్టు చేసి యోగీని భళా అంటూ ఆకాశానికెత్తేసిన తేజస్వీ సూర్య... ఆ ఎక్స్‌ప్రెస్ హైవే సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా నిర్మించిందన్న విషయం తెలుసుకోవాలని అఖిలేష్ కౌంటర్ ఇచ్చారు. ఇది ఉపయోగం లేని యోగీ (అన్ఉప్‌యోగీ) హయాంలో నిర్మించింది కాదన్న వాస్తవాన్ని గ్రహించాలంటూ ట్వీట్ చేశారు.

UP Polls 2022:Twitter war between Akhilesh and Tejaswi Surya, have a look at what they both tweeted

ఇక తేజస్వీ సూర్య- అఖిలేష్‌కు మధ్య ట్వీట్ వార్‌కు కారణమైన ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేను అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2016లో నిర్మాణం పూర్తయ్యింది. అయితే 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక యోగీ ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఫిబ్రవరి నెలలో ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభమైంది. ఇక అఖిలేష్ ట్వీట్‌కు మరో ట్వీట్‌ను తేజస్వీ సూర్య పోస్టు చేశారు. 1947 నుంచి 2017 వరకు ఉత్తర్ ప్రదేశ్‌లో 467 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరిగింది.

అంటే యోగీ ఆదిత్యనాథ్ అధికారంలోకి రాగానే ఈ సంఖ్య 1321 కిలోమీటర్లకు చేరిందంటూ సూర్య పోస్టు చేశాడు. ఇక ఇది ఇంతటితో ఆగలేదు. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్ఎల్‌డీ కూడా తేజస్వీపై విరుచుకుపడింది. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా పూర్తయిన ఎక్స్‌ప్రెస్ వే ... యోగీ పూర్తి చేశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఇక యువ ఎంపీ అయిన తేజస్వీ యాదవ్ కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మరింత దారుణమైన విషయంగా ఆ పార్టీ పేర్కొంది. ఎలాగైతేనేం తేజస్వీ మాత్రం తాను చేసిన తప్పును తప్పుగా ఒప్పుకునే ధైర్యం లేదంటూ ఆర్ఎల్‌డీ ట్వీట్ చేసింది.

Recommended Video

    Uttar Pradesh Elections 2022: ఓటేసిన ప్రముఖులు, కేంద్ర మంత్రులు | Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+