యూపీ పోల్స్: నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు పరుగెత్తిన మంత్రి(వీడియో)
లక్నో: మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ బాలియా జిల్లాలో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఫేఫ్నా స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ.
ఆయన తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఫిబ్రవరి 11వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు సమయం ఉన్నప్పటికీ.. శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చిన ఉపేంద్ర తివారీ.. ఆ రోజు సమయం ముగుస్తుండటంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు.
#WATCH | UP Sports Minister Upendra Tiwari sprinted to Collectorate Office in Ballia y'day as he was running late to file his nomination. Y'day nominations were scheduled to be filed by 3 pm & the minister was running late, nomination process still ongoing#UttarPradeshElections pic.twitter.com/99HSIPHwoA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022
Recommended Video
సెక్యూరిటీ సిబ్బంది కూడా మంత్రి వెంట పరుగులు తీశారు. నామినేషన్ దాఖలుకు మరో మూడు నిమిషాలు ఉండగా తన పత్రాలను అందజేశారు. సమయాభావం కావడంతోనే పరుగెత్తాల్సి వచ్చిందని మంత్రి ఉపేంద్ర తివారీ తెలిపారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications