వారణాసిలో ప్రధాని మోడీ రోడ్ షో: రోడ్‌సైడ్ స్టాల్‌లో చాయ్ తాగి, కాశీ క్షేత్రంలో డమ్రు వాయించి ఆనందం
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరి దశ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. ఏడో దశలో ప్రధాని మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి కూడా ఉంది.
కాశీలో ప్రధాని మోడీ.. డమ్రు వాయిస్తూ ఆనందం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వారణాసిలోని మీర్జాపూర్ నుంచి ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన దర్శనం కోసం కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీ.. మరోసారి భిన్నమైన రూపంలో కనించారు.
ప్రధాని మోడీ ఇక్కడ డమ్రు వాయించేందుకు ప్రయత్నించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకున్న ప్రధానికి అర్చకులు డప్పులు వాయిస్తూ స్వాగతం పలికారు. ఆలయం వెలుపల, ప్రధాని మోడీ పూజారి చేతి నుంచి డమరు అందుకున్నారు. కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని మోడీ కూడా డమ్రు వాయించి ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కాశీ వీధిలో టీకా దుకాణంలో చాయ్ తాగిన ప్రధాని మోడీ
అంతకుముందు వారణాసిలో జరిగిన రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షో నగరంలోని ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమై దక్షిణ అసెంబ్లీ మీదుగా కంటోన్మెంట్‌లో ముగిసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ప్రధాని మోడీ కూడా అందరినీ అప్యాయంగా పలకరించారు. రోడ్ షో సందర్భంగా వారణాసి వీధిలోని ఓ టీ దుకాణంలో ప్రధాని మోడీ చాచ్ తాగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
Recommended Video
ప్రధాని మోడీపై అభిమానం చాటుకున్న కాశీ వాసులు
ప్రధాని మోడీ సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాని మోడీ రోడ్ షో సర్దార్ పటేల్ కూడలి నుంచి ప్రారంభమైంది. ప్రధాని మోడీ రోడ్ షో మాల్దాహియా కూడలి నుంచి లోహ మండి స్క్వేర్, లాహురబీర్, పిప్లానీ కత్రా, కబీర్‌చౌరా, లోహటియా, మైదాగిన్, బులనాలా, చౌక్ మీదుగా కాశీ విశ్వనాథ్ ధామ్‌కు చేరుకున్న తర్వాత ముగిసింది. రోడ్ షో చేస్తున్న ప్రధాని మోడీపై ప్రజలు పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. మార్చి 7న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications