మార్చి 10 తర్వాత సీజనల్ రాజకీయ నాయకులు వెకేషన్ వెళ్తారు: కాంగ్రెస్, ఎస్పీలపై మోడీ సెటైర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం బీజేపీదేనని అన్నారు. ఎన్నికల సమయంలో చురుకుగా ఉండే కొంతమంది "సీజనల్ రాజకీయ నాయకులు" మార్చి 10 తర్వాత మళ్లీ సెలవులకు వెళతారని చురకలంటించారు.
Recommended Video

సీజనల్ రాజకీయ నేతల గురించి యూపీ ప్రజలకు తెలుసు: మోడీ
కౌశాంబిలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "మీరు కోవిడ్‌లో 'మౌసామి' (సీజనల్) నాయకులను చూడవచ్చు, వారు గరిష్ట సమయంలో అదృశ్యమయ్యారు. అది నియంత్రించబడినప్పుడు మళ్లీ కనిపించారు... వారు వ్యాక్సిన్‌లకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారు, కానీ తాము టీకాలు వేయించుకున్నారు... యూపీ ప్రజలకు 'సీజనల్' నాయకుల గురించి బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు. కౌశాంబి అభివృద్ధికి దూరమైందని.. వంశపారంపర్య రాజకీయ పార్టీలే ఇందుకు కారణమని ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ మండిపడ్డారు.

ఉగ్రవాదులను కాపాడే పార్టీ ఎస్పీ: మోడీ ఫైర్
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులను రక్షించేందుకు చేయగలిగినదంతా చేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ ఇతరుల భూములు, ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు.. మా అమ్మానాన్నలు, ఆడబిడ్డలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అభద్రతాభావానికి గురయ్యారు. ఆ నాయకులు విలాసవంతమైన రాజభవనాలు నిర్మించుకున్నారు. మరోవైపు మేము పేదలకు ఇళ్లను నిర్మించాము, "అని ప్రధాని నరేంద్ర మోడీ ఎస్పీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై మండిపడ్డారు.
వారసత్వ పార్టీలో పేదల రేషన్ కూడా దొంగిలించారు: మోడీ
వారసత్వ పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదల రేషన్ దొంగిలించారని, పేదలను పరిపాలనకు దూరం చేశారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ప్రజల సౌకర్యం కోసం వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్‌ను తీసుకొచ్చామని, ఇప్పుడు కౌశంబి ప్రజలు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందవచ్చని ప్రధాని మోడీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేడు నాలుగో దశ పోలింగ్ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల చివరి దశ మార్చి 7న నిర్వహించి, ఎన్నికల ఫలితాలు 2022 మార్చి 10న వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications