వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివపాల్‌కు అఖిలేష్ ఝలక్, ఎన్నికలవేళ ఎస్పీకి షాక్

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన బాబాయి శివపాల్ యాదవ్‌కు ఝలక్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు సమాజ్ వాది పార్టీలో కుటుంబ రగడ కనిపించింది. ఆ తర్వాత సద్దుమణిగినట్లే కనిపించింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన బాబాయి శివపాల్ యాదవ్‌కు ఝలక్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు సమాజ్ వాది పార్టీలో కుటుంబ రగడ కనిపించింది. ఆ తర్వాత సద్దుమణిగినట్లే కనిపించింది.

అయితే, తాజాగా బాబాయ్ శివపాల్ యాదవ్‌కు అఖిలేష్ షాకిచ్చారు. పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. నలభై మందితో కూడిన ప్రచారకర్తల జాబితాను మంగళవారం విడుదల చేశారు.

అందులో మొదటి స్థానంలో ములాయం సింగ్ యాదవ్ పేరు ఉంది. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ పేరు ఉంది. కిరణ్మయ్ నంద పేరు మూడో స్థానంలో ఉంది. తక్కిన వారి పేర్లలో అజంఖాన్, రామ్ గోపాల్ యాదవ్ తదితరులున్నారు. శివపాల్ యాదవ్ ఊసు మాత్రం లేదు.

 UP polls: Shivpal Yadav finds no mention in Akhilesh's list of star campaigners

అఖిలేష్‌కు షాక్

అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి ఎన్నికల వేళ ఎదురుదెబ్బ తగిలింది. 17 వెనుకబడిన తరగతుల (ఓబీసీ)ను ఎస్సీ జాబితాలోకి చేరుస్తూ యూపీ సర్కార్ గత డిసెంబర్ 22న ఇచ్చిన ఉత్తర్వుపై అలహాబాద్ హైకోర్టు మంగళవారంనాడు స్టే విధించింది.

దీంతో ఓబీసీలను ఎస్సీ జాబితాలోకి చేర్చడం ద్వారా ఎన్నికల్లో వారి ఓట్లను ఆకట్టుకోవాలన్న అఖిలేష్ ప్రభుత్వ ఆలోచనకు గండిపడింది. గత ఏడాది ఈ ప్రతిపాదనను యూపీ కేబినెట్ ఆమోదించి క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపింది.

ప్రమాదంలో నా జీవితం, అఖిలేష్ సపోర్టర్ చంపేస్తానన్నాడు: అమర్ సింగ్ప్రమాదంలో నా జీవితం, అఖిలేష్ సపోర్టర్ చంపేస్తానన్నాడు: అమర్ సింగ్

డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే ఒక సంస్థ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది.

ప్రభుత్వ ఉత్తర్వు రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకుని లబ్ది పొందేందుకు జరిగిన ప్రయత్నమని, ఇది భారత రాజ్యాంగంలోని 341వ ఆర్టికల్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆ పిల్‌ పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది.

English summary
The bitter power game within the Mulayam clan appeared to be festering with Chief Minister Akhilesh Yadav, in his new role as Samajwadi Party chief, leaving out his warring uncle Shivpal Yadav from the list of party's star campaigners for the UP Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X