రాముడిని విశ్వసించేవారికే చోటు.. బీజేపీ ఎమ్మెల్యే కాంట్రవర్సీ కామెంట్స్

దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. చివరీ నిమిషంలో కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం హాట్ కామెంట్స్ చేశారు. లోని ఎమ్మెల్యే నంద్ కిశోర్ గుజ్జర్ పక్కా హిందుత్వ కామెంట్స్ చేశారు. అదీ ఇప్పుడు దుమారం రేపుతుంది.శ్రీరాముడు, భజ్‌రంగ్‌బలిని ఎవరూ విశ్వసిస్తారో.. వారే ఇక్కడ ఉంటారు అని కామెంట్ చేశారు.

తన నియోజకవర్గ ఓటర్లు తనపై విశ్వాసం ఉంచుతారని కామెంట్ చేశారు. అందుకు తాను గత ఐదేళ్లలో చేసిన పనులే ఉదహరణ అని చెప్పారు. నేరరహితంగా రాష్ట్రాన్ని మార్చామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తాను మళ్లీ తిరిగి ఎన్నికైతే, తమ ప్రభుత్వం ఏర్పడితే.. మంత్రి పదవీ కూడా ఆశించడం లేదన్నారు. లొని నుంచి బీజేపీ తరఫున నంద్ ఉండగా.. ఆర్ఎల్డీ నుంచి మదన్ భయ్యా బరిలో ఉన్నారు. 2017లో బీఎస్పీ అభ్యర్థి జకీర్ అలీ, ఆర్ఎల్డీ మదన్‌ను నంద్ కిశోర్ ఓడించారు. కానీ చేసిన హిందుత్వ కామెంట్స్ దుమారం రేపాయి.

UP polls: Those who believe in Bajrangbali, Lord Ram will remain here: MLA Nand Kishor

Recommended Video

    UP Elections 2022: Congress Manifesto VS SP Manifesto | Priyanka Gandhi | Oneindia Telugu

    తొలివిడతలో మొత్తం 11 జిల్లాల్లో గల 58 నియోజకవర్గాల ఓటింగ్ జరగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది. యూపీలో మొత్తం 7 విడతలో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఆ రోజు ఎవరూ రాజు తెలియనుంది. యూపీలో విజయం సాధిస్తే.. దేశంలో అధికారం చేపట్టడం ఖాయం అని బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చిన సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+