రక్షణేది?: మహిళా కానిస్టేబుల్‌పై పోలీసుల గ్యాంగ్‌రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలు, మహిళల మానప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఓ మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని పోలీసుల వాహనంలోనే చేయడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. యూనిఫాంలో ఉన్న ఇద్దరు పోలీసులు, మరోవ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఉత్తరప్రదేశ్ ఇటావాలోని ఝాన్సీకి చెందిన మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మేళా సందర్భంగా విధుల్లో పాల్గొని తిరిగి తన తోటి మహిళా కానిస్టేబుల్‌తో కలిసి వెళుతుండగా, ఇద్దరు మగ పోలీసులు తమను బెదిరించి పోలీసు వాహనంలో ఎక్కించారని తెలిపింది.
ఆ తర్వాత మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారని ఆరోపిస్తోంది. అనంతరం తుపాకీ గురి పెట్టి, చంపేస్తామంటూ అఘాయిత్యానికి పాల్పడి అనంతరం రోడ్డుపై విసిరేసి వెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆస్పత్రిలో కూడా తన సోదరికి రక్షణ లేదనీ.. తమకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి విజ్ఞప్తి చేసింది.

అనాధలమయిన తమకు న్యాయం జరగాలని.. రక్షించాల్సిన పోలీసులే దాడికి పాల్పడితే ఎవరితో చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై ఎటావా సీనియర్ పోలీస్ అధికారి మాంజీ సైని మాట్లాడుతూ.. ఘటనపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆమె తిరిగి ఝాన్సీ వెళ్లడానికి భయపడుతోందన్నారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరిని ఖాకీ దుస్తులపై ఉన్న నేమ్ ప్లేట్స్ ఆధారంగా బాధితురాలు గుర్తించినట్లు చెప్పారు. నిందితులను అజయ్ యాదవ్, రాజ భాయ్‌గా, మరొకర్ని డ్రైవర్‌గా గుర్తించిందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications