యూపిలో మాంసవిక్రేతల సమ్మె, నిబంధనలు పాటించాల్సిందేనన్న యోగి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మాంస వ్యాపారులు నిరవధిక సమ్మెకు పూనుకొన్నారు.తాజాగా చేపల వ్యాపారులు కూడ సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. దీంతో మాంసం ఉత్తర్ ప్రదేశ్ దొరికే అవకాశం లేకుండా పోయింది.మాంస ప్రియులు ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తోందా అని ఎదురుచూస్తున్నారు.

సోమవారం నుండి చేపల వ్యాపారులు కూడ మాంస వ్యాపారుల సమ్మెలో పాలుపంచుకొంటున్నట్టు ప్రకటించారు.లక్నోబాక్రా ఘోష్ వ్యాపార్ మండల్ ఆఫీసర్స్ బేరర్ ముబీన్ ఖురేషీ సోమవారం నాడు చెప్పారు.

మాంసం విక్రయాలు నిలిచిపోవడంతో మాంసభోజనాలు విక్రయించే ప్రముఖ హోటళ్ళు నిర్వాహకులు కూడ ఇబ్బందిపడుతున్నారు. అయితే మాంసం విక్రయాలపై లక్షలాది మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఖురేషీ గుర్తు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమంగా వెలిసిన స్లాటర్ హౌజ్ లను మూసివేయాలని ఆదేశించారు.

అయితే ఉత్తర్ ప్రదేశ్ లో మాంసాహర విక్రయాలు బంద్ కావడంతో ఢిల్లీ నుండి మాంసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కొందరు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.అయితే అదే సమయంలో నాణ్యత విషయంలో రాజీపడబోమని వారు చెబుతున్నారు.

అయితే అక్రమంగా వెలిసిన స్లాటర్ హౌజ్ లను మాసివేయాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.చాలావరకు స్లాటర్ హౌజ్ లు ఓపెన్ ప్రదేశాల్లోనే ఉంటాయి.దీని వల్ల స్థానికంగా ఉండే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

slaughterhouses

అయితే ఇది ఓ మతానికి సంబందించిన విషయం కాదని ప్రజల ఆరోగ్యానికి సంబందించిన విషయంగా ఉంది.ప్రజలు మంచి మాంసాన్ని పొందడమే ప్రభుత్వ ఉద్దేశ్యంగా కన్పిస్తోంది.

అయితే ఈ విషయమై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిట్ పాత్ర ఢిల్లీలో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను మాత్రమే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తోందని చెప్పారు. భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని దీన్ని అరికట్టేందుకుగాను యూపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు.

అయితే ఎవరైతే నియమనిబంధనలకు అనుగుణంగా మాంస దుకాణాలు నిర్వహిస్తున్నారో వారికి ఇబ్బందులు తలెత్తవన్నారు.జిల్లా కలెక్టర్ నాయకత్వంలో ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ కమిటీని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.ప్రతి రోజు ఈ కమిటీ స్లాటర్ హౌజ్ లను సందర్శించి కలెక్టర్ కు నివేదికను అందించనుందన్నారు.

అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల చిన్న మాంసవ్యాపారులే నష్టపోతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన యూపి నాయకుడు అఖిలేష్ ప్రతాప్ సింగ్ అభిప్రాయపడ్డారు.అక్రమంగా స్లాటర్ హౌజ్ లు నిర్వహించే వారిపై చర్యలు తీసుకొంటామని యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Meat sellers across Uttar Pradesh go on an indefinite strike from today against the crackdown on illegal and mechanised slaughterhouses.
Please Wait while comments are loading...