ప్రభుత్వ పాఠశాలలో ఘోరం.. మందుకొట్టి, అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్స్!

Posted By:
Subscribe to Oneindia Telugu

మీర్జాపూర్ : సర్కారు బడి సాక్షిగా అమ్మాయిలు అర్దనగ్నంగా నృత్యం చేసిన బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. యూపీలోని మీర్జాపూర్ గ్రామంలో రక్షాబంధన్ వేడుకలు ముగిశాక ఈ ఘోరం చోటుచేసుకుంది.

అదేరోజు స్థానిక గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్ జన్మదినం కావడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సెలవు ప్రకటించేసి అమ్మాయిలను రప్పించి వారితో అర్దనగ్నంగా నృత్యం చేయించారు.

కొందరు పాఠశాలలోనే మద్యం తాగి అమ్మాయిల రికార్డింగు డ్యాన్సుతో మజా చేశారు. పాఠశాలను డ్యాన్స్ బార్ గా మార్చిన ఘటనపై అసిస్టెంట్ ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ శిక్షా అధికారి ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలను డ్యాన్స్ బార్ గా మార్చారని బ్లాక్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు తివారీకి నివేదిక సమర్పించారు. పాఠశాలలో మద్యం తాగి డ్యాన్సులు చేయడం అభ్యంతరకరమని దీనిపై గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్ పై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ కు నివేదించారు.

అయితే ఈ విషయంలో తనకేం సంబంధం లేదని, పాఠశాలలో డ్యాన్స్ కార్యక్రమం జరిగినపుడు తాను అక్కడ లేనని, తన బంధువుల ఇంట్లో ఉన్నానని గ్రామపెద్ద రాంకేష్ యాదవ్ తప్పించుకోవడం కొసమెరుపు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A government primary school in a Mirzapur village in Eastern Uttar Pradesh turned into a dance party venue on the night of Rakshabandhan when relatives of the local village head apparently decided to celebrate a birthday party. The school at Tetraihiya Kala Khurd in Jamalpur was closed on Monday due to the festival. When teachers reached on Tuesday, they found the premises littered. Locals told them that it was the result of a party organised by village head Ramkesh Yadav’s family.
Please Wait while comments are loading...