ఏడాది పాటు స్త్రీపై గ్యాంగ్ రేప్: భయంతో హత్య

హజీపూర్: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హజిపూర్‌లో ఓ మహిళపై జరిగిన దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ విధవపై ఏడాది నుంచి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. తనకు చెల్లించాల్సిన డబ్బులు అడక్కుండా ఉండాలంటే కోరినప్పుడు రావాలని ఆ వడ్డీ వ్యాపారి ఆదేశాలు జారీ చేశాడు.

తనతో పాటు మరికొంతమంది కూడా వస్తారని ఆమెకు చెప్పాడు. అప్పు తీర్చలేని దయనీయమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళ అందుకు అంగీకరించింది. దాదాపు ఏడాది కాలంగా ఆమెతో వడ్డీ ఆ మహిళతో ఆ పని చేయిస్తున్నాడు. చివరకు మహిళ హత్యతో బండారం బయటపడింది.

Gan rape

ఉత్తరప్రదేశ్‌లోని హజిపూర్ గ్రామానికి చెందిన లతాదేవి భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఓ కూతురు ఉంది. కూతురు పెళ్లి చేయడానికి ఓ వడ్డీ వ్యాపారి దగ్గర లతాదేవి 20 వేల అప్పు తీసుకుంది. 15శాతం వడ్డీకి అప్పు ఇస్తానని అతను చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తీసుకుంది.

కూతురు పెళ్లైన నెలరోజులకే వడ్డీ వ్యాపారి అప్పు చెల్లించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు కట్టలేని స్థితిలో తన కోరిక తీర్చాలని ఆ వడ్డీ వ్యాపారి అడిగాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించిన ఆమెను ఏడాది నుంచి బలవంతంగా నిర్భంధించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

పోలీసులకు చెబుతుందేమోనన్న భయంతో ఆమెను ఓ చెట్టుకు ఉరేసి చంపేశారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆమె హత్యతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+