కి"లేడీ"లు: హవ్వా...! భర్త బతికుండగానే వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు
సీతాపూర్: ఈ వార్త చదివితే షాక్‌కు గురవుతారు. భర్తలు బతికుండగానే మహిళలు వితంతు పెన్షన్లు తీసుకుంటున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. భర్త మరణించిన మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న వితంతు పెన్షన్ పక్కదోవ పడుతోంది. ఇందుకు నిదర్శనం ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం.

తప్పుదోవ పడుతున్న వితంతు పెన్షన్ల పథకం
ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఇస్తున్న వితంతు పింఛన్ పక్కదారి పడుతోంది. భర్తలు బతికుండగానే వారు మృతి చెందినట్లు చూపించి మహిళలు పెన్షన్ తీసుకుంటున్న విషయం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకే జిల్లాలో 22 మంది మహిళలు ఈ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడుతూ అడ్డంగా దొరికారు. సందీప్ కుమార్ అనే వ్యక్తి బత్స్‌గంజ్ గ్రామంలో నివసిస్తున్నాడు. 10 రోజుల క్రితం తన భార్య ఫోనుకు ఓ మెసేజ్ రావడం గమనించాడు. అది బ్యాంకు నుంచి వచ్చింది. తన భార్య బ్యాంకు ఖాతాలో రూ.3వేలు జమ అయినట్లు మెసేజ్ రావడంతో అసలు సంగతి ఏమిటిని విచారణ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాధానం చూసి షాక్‌కు గురయ్యాడు.

భర్త బతికుండగానే ప్రతి నెల రూ.3వేలు వితంతు పెన్షన్
సందీప్ కుమార్ భార్య అకౌంట్‌లో క్రెడిట్ అయిన డబ్బు వితంతు పెన్షన్. సందీప్ బతికుండగానే చనిపోయినట్లు సృష్టించి ప్రతినెలా ఆయన భార్య వితంతు పెన్షన్ పొందుతోంది. ఇది ఒక్క తన భార్యే కాదు... ఆమె చెల్లెలు, ఆమె తల్లి కూడా ఈ వితంతు పెన్షన్ పొందటాన్ని చూసి విస్మయానికి గురయ్యాడు. వీళ్ల భర్తలు కూడా బతికుండగానే చనిపోయినట్లుగా చూపించి పెన్షన్ పొందుతున్నారు. దీనిపై ప్రొబేషన్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పాడు. ఆ తర్వాత మరోసారి ఫిర్యాదు చేయడంతో యంత్రాంగం కదిలింది.

భర్త చనిపోయారని చెప్పి పెన్షన్ పొందుతున్న 22 మంది మహిళలు
ఇక సందీప్ కుమార్ ఫిర్యాదుతో యంత్రాంగం విచారణ జరిపింది. ఇలా భర్త బతికుండగానే చనిపోయాడని తప్పుడు పత్రాలు సృష్టించి వితంతు పెన్షన్ పొందుతున్న మహిళలు చాలామంది బయటపడ్డారు. దీనిపై సీరియస్‌గా స్పందించింది జిల్లా యంత్రాంగం. ఎవరైతే ఇలా దొంగ పత్రాలు సృష్టించి వితంతు పెన్షన్ పొందారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇది తన దృష్టికి వచ్చిందని ఇలా మోసం చేసి వితంతు పెన్షన్ తీసుకుంటున్నవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శీతావర్మ తెలిపారు.












Click it and Unblock the Notifications