గుండెల్ని పిండేసే లేఖ: ఆ తండ్రిని మార్చలేక టీనేజీ యువకుడి ఆత్మహత్య..

చెన్నై: తాగుబోతు తండ్రి వ్యసనాన్ని భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను రాసిన లేఖ కంటతడి పెట్టించేదిగా ఉంది. ఇంటర్‌ పూర్తి చేసి నీట్‌కు సిద్దమవుతున్న ఆ కుర్రాడు తండ్రి తాగుబోతు దాష్టికానికి తీవ్రంగా కుమిలిపోయాడు. తన చావుతోనైనా తండ్రిలో మార్పు వస్తుందని భావించి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఎవరీ యువకుడు?:

ఎవరీ యువకుడు?:

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్‌పట్టి గ్రామానికి చెందిన మాడసామి, ఈశాకి అమ్మాళ్‌ కుమారుడు దినేశ్‌ నల్లశివన్‌ (17). ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్ష కోసం సిద్దమవుతున్నాడు. 9ఏళ్ల క్రితమే తల్లి మరణించడంతో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తండ్రి తాగుడుకు బానిసయ్యాడు.

తాగుడుకు బానిసైన తండ్రి:

తాగుడుకు బానిసైన తండ్రి:

భార్య మరణించాక మాడసామి మరో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తాగుడు మానలేదు. తాగడం.. రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం మాడసామికి నిత్యకృత్యం అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పి చూసినా అతనిలో మార్పు రాకపోవడంతో.. తన చావుతోనైనా తండ్రి మద్యపానాన్ని మాన్పించాలనుకుని బుధవారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గుండెల్ని పిండేసే లేఖ:

గుండెల్ని పిండేసే లేఖ:


'నాన్నా.. నా చావుతోనైనా నువ్వు మారతావనుకుంటున్నాను. ఇకనుంచైనా తాగుడు మానెయ్‌. కనీసం నా శవానికి తలకొరివి పెట్టేందుకైనా నువ్వు మద్యం తాగకుండా వస్తావనుకుంటున్నా. అయినా తాగకుండా ఉండలేననుకుంటే.. దయచేసి నా అంత్యక్రియలకు రాకు. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది' అంటూ దినేశ్ రాసిన లేఖ పలువురిని కంటతడి పెట్టించింది.

ఇకనైనా మద్యం షాపులను మూసేయకపోతే..:

ఇకనైనా మద్యం షాపులను మూసేయకపోతే..:

తండ్రికే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మద్యం షాపులను మూసేయాలని దినేశ్ విజ్ఞప్తి చేశాడు. ఇకనైనా తమిళనాడులో మద్యం షాపులను మూసేయకపోతే నా ఆత్మనే వాటిని ధ్వంసం చేస్తుందని దినేశ్ లేఖలో పేర్కొనడం గమనార్హం. సూసైడ్ నోట్ పక్కనే ఓ పాలిథీన్ కవర్ లో పాడైపోయిన ఒక మొబైల్ ఫోన్ లభించింది. అదే కవర్ లో దినేశ్ నీట్ హాల్ టికెట్, పదో తరగతి మార్క్స్ షీట్ లభించాయి. గత ఐదేళ్ల నుంచి తండ్రితో తాగుడు మానిపించడానికి దినేశ్ తీవ్రంగా ప్రయత్నించాడని, చివరకు విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బాబాయ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+