వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాలు ఉద్యోగం చేస్తోందని ప్రియుడు ఏంచేశాడో తెలిస్తే షాక్‌కు గురవుతారు

|
Google Oneindia TeluguNews

ప్రియురాలు ఉద్యోగం చేస్తుందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి తన గొంతును తానే కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు వైద్యులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళితే... ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలోని కోదా ప్రాంతంలో నివాసముంటున్న రవి యాదవ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా రవిని ప్రేమిస్తోంది. రవి యాదవ్ ఒక ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు.

రోజులానే గురువారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు రవియాదవ్. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కొద్ది గంటలకే తిరిగి ఇంటి తలపును కొట్టాడు. నిద్రలో ఉన్న తన తండ్రి రాజు యాదవ్ నిద్రనుంచి మేల్కొని తలుపు తీశాడు. డ్యూటీకి వెళ్లిన వాడివి తిరిగి ఎందుకు వచ్చావు అని కొడుకును రాజు యాదవ్ ప్రశ్నించాడు. అంతే గుడ్ బై అని చెప్పి రవి కిందకు పడిపోయినట్లు రాజు యాదవ్ చెప్పాడు. అప్పటికే తన గొంతును బ్లేడుతో కోసుకున్నాడని రక్తపు మడుగులో పడిపోయాడని రాజు యాదవ్ తెలిపాడు. రక్తపు మడుగులో పడివున్న కొడుకుని లేపి దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

Upset’ with girlfriend taking up job, Ghaziabad man slashes throat, survives

విషయం తెలుసుకున్న రవి ప్రియురాలు కూడా హాస్పిటల్‌కు చేరుకుంది. వారి మధ్య స్థిరమైన సంబంధాలు కొనసాగేవని.. గత నాలుగు రోజులుగా ఇద్దరు గొడవపడుతున్నట్లు బాధితుడి తండ్రి రాజు యాదవ్ తెలిపారు. ఈ మధ్యే అమ్మాయి కొత్తగా ఉద్యోగంలో చేరడంతో రవి కాస్తు ఆమెపై కోపంగా ఉన్నట్లు తండ్రి తెలిపాడు. అమ్మాయి పనిచేయడం రవికి ఇష్టం లేదని తండ్రి చెప్పాడు. ఇది జీర్ణించుకోలేని రవి డ్యూటీకి వెళుతున్నానని చెప్పి మార్గమధ్యలో బ్లేడుతో గొంతుకోసుకున్నట్లు తండ్రి తెలిపాడు. ప్రస్తుతం ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని రాజు యాదవ్ స్పష్టం చేశాడు.

English summary
A 22-year-old man allegedly slashed his throat in Khoda on Wednesday morning, because he was allegedly “opposed” to his girlfriend taking up a job. Ravi Yadav, a resident of Anil Vihar in Khoda and employed as a food delivery man with a firm in Noida’s Sector 37, sustained severe injuries to his throat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X