రైలెక్కిన వెంకయ్య మాట్లాడారు, చేయిచ్చారు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైలు ఎక్కి సామాన్యులతో కలిసి ప్రయాణించారు.
విమానాశ్రయంలో దిగిన ఆయన అక్కడ రైలు ఎక్కి శివాజీ స్టేడియం స్టేషన్ వరకు ప్రయాణించారు. అక్కడ రైలు దిగిన ఆయన కారులో తన కార్యాలయానికి చేరుకున్నారు.
కాగా, ఈ రైలులో ప్రయాణించడం ఎంతో సౌకర్యవంతంగా ఉన్నదని, భవిష్యత్తులోనూ తాను విమానాశ్రయానికి మెట్రోలోనే ప్రయాణిస్తానని చెప్పారు. అంతేకాదు తన మంత్రివర్గ సహచరులను కూడా రైలులోనే ప్రయాణించమని చెబుతానని చెప్పారు.

వెంకయ్య నాయుడు
వెంకయ్య నాయుడు మెట్రో రైలులోనే కన్నాట్‌ప్లేస్ సమీపంలోని శివాజీ స్టేడియం స్టేషన్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న తన కార్యాలయానికి కారులో చేరుకున్నారు. మార్గమధ్యంలో ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎండీ మంజూసింగ్, సంబంధిత అధికారులు, ప్రయాణికులతో మెట్రోద్వారా లభిస్తున్న ప్రయోజనాల గురించి చర్చించారు.

వెంకయ్య నాయుడు
మెట్రో రైలులో ప్రయాణించిన సమయంలో వెంకయ్య నాయుడు ప్రయాణీకులతో ముచ్చటించారు. వారి నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

వెంకయ్య నాయుడు
మెట్రో రైలులో ప్రయాణించిన వెంకయ్య నాయుడు ఓ యువకుడితో కరచాలనం చేస్తున్న దృశ్యం. ఆయనతో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు పలువురు ఆసక్తి చూపించారు.

వెంకయ్య నాయుడు
మార్గమధ్యంలో వెంకయ్య నాయుడు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎండీ మంజూసింగ్, సంబంధిత అధికారులు, ప్రయాణికులతో మెట్రోద్వారా లభిస్తున్న ప్రయోజనాల గురించి చర్చించారు.












Click it and Unblock the Notifications