పాక్‌కు మోడీ షాక్: భారత్‌కు ఇజ్రాయిల్ సాయం, ఆర్మీ చీఫ్ ఏమన్నారు?

న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్థాన్‌కు భారత్ ఇచ్చిన మోస్ట్ ఫేవర్‌డ్ నేషన్ హోదాను రద్దు చేసుకునే యోచనలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఉంది. ఇదే గనుక జరిగితే పాకిస్థాన్ ఆర్ధికంగా నష్టపోనుంది. భారత్ ఇస్తున్న ఈ హోదా వల్ల పాకిస్థాన్ ఆర్థికంగా ప్రయోజనం పొందింది.

జమ్మూకాశ్మీర్ యూరీ సెక్టార్‌లోని ఆర్మీ సైనిక స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం పాక్‌పై ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో ఉంది. అంతేకాదు దౌత్యపరమైన సంబంధాలు తెంచుకునేందుకు కూడా చర్యలు ప్రారంభించింది.

India Mulls Revoking Most Favored Nation Tag for Pak

భారత్ ప్రజలు అయితే పాక్‌పై యుద్ధం చేయాల్సిందేనని అంటున్నారు. ఇదే సమయంలో భారత్-పాక్ మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్న వేళ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా కోల్పోవడం వల్ల పాకిస్థాన్ మరిన్ని కష్టాల్లో పడనుంది.

వదులుకునే ప్రసక్తే లేదు: పాక్ ఆర్మీ చీఫ్

పాకిస్థాన్‌కు తన భూభాగంలోని ప్రతీ అంగుళాన్నీ రక్షించుకునే సామర్థ్యం ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఖరియన్‌లోని నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్‌ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ''దేనిని వదులుకునే ప్రస్తక్తే లేదు'' అని ఆయన స్పష్టం చేశారు.

ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనే సత్తా పాకిస్థాన్‌కు ఉందని అన్నారు. దశాబ్దాలుగా పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశంగానే ఉందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో రషీల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్‌కు సాయం అందించేందుకు ఇజ్రాయిల్ సిద్ధం

యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు సహకారం అదించేందుకు ఇజ్రాయిల్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. భారత్‌తో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇజ్రాయిల్ రాయబారి డానియల్ కార్మన్ తెలిపారు. నవంబర్‌లో ఇజ్రాయిల్ హోంల్యాండ్ సెక్యూరిటీ(హెచ్ఎల్ఎస్) అండ్ సైబర్ 2016 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుంది.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇజ్రాయిల్‌లో పర్యటించినప్పుడు దేశంలోని వివిధ సరిహద్దులను సందర్శించారని కార్మన్ తెలిపారు. సరిహద్దు రక్షణ విషయంలో ఇరు దేశాలు ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ సమస్యలకు ఇజ్రాయిల్ వద్ద పరిష్కారం ఉందని పేర్కొన్నారు.

రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. సరిహద్దు రక్షణ కోసం ఇజ్రాయిల్ వద్ద సైబర్ టెక్నాలజీ ఉందని స్పష్టం చేశారు. యాంటీ టెర్రరిజం, డిఫెన్స్, హోంల్యాండ్ సెక్యూరిటీ వంటి అంశాల్లో భారత్‌కు ఇజ్రాయిల్ తన సహకారాన్ని అందిస్తుందని కార్మన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+