యూరీ ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్లంతా 20 ఏళ్ల లోపు వారే

యూరీ: జమ్మూ కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌ 12వ బ్రిగెడ్ హెడ్ కార్వర్ట్స్‌పై నలుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడి 18 మంది జవాన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ఆర్మీ ఉన్నతాధికారులు విచారణ జరుపగా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.

ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారంతా 20 ఏళ్ల వయసు లోపు వాళ్లే. ఉగ్రవాదులకు పోస్టుమార్టం నిర్వహించిన శ్రీనగర్‌లోని 92 బేస్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు తమను ఎవరూ గుర్తించకుండా దాడికి ముందు మిలటరీ సైనికుల మాదిరి హెయిర్ కటింగ్ చేయించుకున్నట్లు గుర్తించారు.

ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్లు దూరాన ఈ నలుగురి మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిపారు. జీపీఎస్ ప్రకారం దాడికి ముందు ఈ నలుగురు మిలిటెంట్లు పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఉగ్రవాదుల వద్ద నుంచి హై ప్రోటీన్‌గల చాక్లెట్లు, ఆరు రెడ్ బుల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.

 Uri terror attack: Terrorists were in their 20s, wore close cropped hair like Armymen

పాకిస్థాన్ గుర్తుగల మూడు ఓఆర్‌ఎస్ ఖాళీ ప్యాకెట్లు కూడా వారి వద్ద లభించాయి. ఉగ్రదాడికి ముందు స్థానికి గొర్రెల కాపరులు వీరికి సాయం చేశారన్న అనుమానంతో దర్యాప్తు సంస్ధలు ముగ్గురిని అదుపులోకి విచారించినట్లుగా సమాచారం.

పది మందిని మట్టుబెట్టిన భారత జవాన్లు

యూరీ సెక్టార్‌లో మంగళవారం సాయంత్రం ఉగ్ర‌వాదులు మ‌రోసారి చొర‌బాటుకి ప్ర‌య‌త్నించారు. అయితే, అప్ర‌మ‌త్తంగా ఉన్న భార‌త సైన్యం వారి చొర‌బాటును దీటుగా తిప్పికొట్టింది. పది మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది. పాక్ సైనికుల్లా వేషం వేసి ఉగ్ర‌వాదులు భార‌త్‌లోకి ప్ర‌వేశించాల‌ని చూశారు.

దీనిని కనిపెట్టిన భార‌త భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఉగ్ర‌వాదుల చొర‌బాటును వెంట‌నే క‌నిపెట్టి, దీటుగా జ‌వాబిచ్చాయి. ఆర్మీ ఉన్న‌తాధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి ప‌రిస్థితిపై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. పాక్ చేసే క‌వ్వింపు చ‌ర్య‌లను ఉపేక్షించ‌కుండా దీటుగా స‌మాధానం చెప్పాల‌ని భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు కేంద్రం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+