చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

DiasporaDiplomacy : ప్రముఖ ఇండియన్ అమెరికన్లతో చెన్నై యూఎస్ కాన్సులేట్ కొత్త కార్యక్రమం...

|
Google Oneindia TeluguNews

చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఈ నెల 28వ తేదీ నుంచి #DiasporaDiplomacy సిరీస్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆయా రంగాల్లో ప్రముఖులైన ఇండియన్ అమెరికన్లతో కన్వర్సేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. తద్వారా వృత్తిపరమైన జర్నీ,అమెరికా-ఇండియా సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర తదితర అంశాలను చర్చకు పెట్టనుంది. అలాగే అమెరికా విద్య,వైద్య,వ్యాపార,ఆవిష్కరణ,అకడమిక్ రంగాల్లో ఇండో అమెరికన్ల పాత్ర గురించి చర్చించనుంది.

ఈ సిరీస్‌లో భాగంగా మొదట ఇండియన్ అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్‌ డా.స్వాతి మోహన్‌తో వర్చువల్ కన్వర్జేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జులై 28,సాయంత్రం 7గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ జనరల్ అధికారి జుడిత్ రవీన్ ఈ సిరీస్‌ను ప్రారంభించనున్నారు.

us consulate general chennai will begin diaspora diplomacy series from july 28th

ప్రస్తుతం డా.స్వాతి మోహన్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రపల్సన్ లేబోరేటరీ(జేపీఎల్)లో నేవిగేషన్,కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ గ్రూప్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. #DiasporaDiplomacy సిరీస్‌ ఇంటరాక్షన్‌లో భాగంగా డా.స్వాతి మోహన్‌ నేషన్స్ స్పేస్4విమెన్ నెట్‌వర్క్ మెంటార్ దీపన గాంధీతో,ఇతర విద్యార్థులు,జర్నలిస్టులు,స్పేస్ సైన్స్ పట్ల ఉత్సుకత కలిగినవారు,తదితరులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఇండియన్ అమెరికన్ మూలాలు,అమెరికాలో ఉన్నత విద్య, సైన్స్,టెక్నాలజీ,ఇంజనీరింగ్,మ్యాథ్స్ రంగాల్లో మహిళల పాత్రపై తన దృక్పథం,ప్రిజర్వెన్స్ మార్స్‌ రోవర్ మిషన్ తదితర అంశాలపై చర్చిస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.

ఈ ఈవెంట్‌ చెన్నై యూఎస్ కాన్సులేట్ జనరల్ ఫేస్‌బుక్ పేజీలో... https://www.facebook.com/chennai.usconsulate/ ఈ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వీక్షకులు తమ ప్రశ్నలను కామెంట్ బాక్స్‌లో అడగవచ్చు. అందులో నుంచి కొన్ని సెలెక్టివ్ ప్రశ్నలకు స్వాతి మోహన్ సమాధానాలిస్తారు.

#DiasporaDiplomacy సిరీస్‌లో భాగంగా నిర్వహించే రెండో కార్యక్రమంలో వర్చువల్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు.గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ఇండియన్ అమెరికన్ సింగర్ ప్రియదర్శినితో అగస్టు 18న ఈ కార్యక్రమం ఉంటుంది. ఔత్సాహిక మ్యూజిషియన్స్‌కు ప్రియ,ఆమె టీమ్ వర్చువల్ వర్క్ షాప్ నిర్వహిస్తారు.

English summary
Consulate General Chennai will begin a #DiasporaDiplomacy series by organizing a virtual conversation with Indian American Aerospace Engineer Dr. Swati Mohan on Wednesday, July 28 at 7 p.m. Dr. Swati Mohan is the Guidance, Navigation, and Control Systems Engineering Group Supervisor at NASA’s Jet Propulsion Laboratory (JPL). She led the Guidance, Navigation, and Controls Operations for NASA Mars 2020 mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X