ట్రంప్ కోసం హిందూ సేన పూజలు -చైనా, పాక్ పని పట్టడంలో భారత్‌కు సాయపడతారని..

భారత్ కు సంబంధించి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకూ ప్రాధాన్యం ఉందంటున్నారు హిందూ సేన కార్యకర్తలు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ర్యాడికల్స్ కు సింహస్వప్నంగా నిలిచిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ ఎన్నికల్లో గెలవాలని హిందూ సేన పెద్ద ఎత్తున పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఓటింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు చేపట్టనుండగా.. ఫలితాలు ట్రంప్ కు అనుకూలంగా రావాలని కోరుతూ ప్రఖ్యాత రైట్ వింగ్ సంస్థ హిందూ సేన ఢిల్లీలోని పలు ఆలయాల్లో పూజలు, హోమాలు చేపట్టింది. ఆయా ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాలకు ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

US Election 2020: Hindu Sena Offers Special Prayers for Donald Trump’s Victory

ట్రంప్ మళ్లీ ఎన్నికయ్యేలా దీవించమని భగవంతుడిని ప్రార్థించామని, ప్రత్యేక పూజలతోపాటు ఆలయాల్లో హోమాలు కూడా తలపెట్టామని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మీడియాకు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ విజయం ప్రపంచానికే కాకుండా భారత్ కు కూడా కీలకమైందని, ట్రంప్ ఇస్లామిక్ రాడికల్స్‌కు పూర్తిగా వ్యతిరేకమని గుప్తా గుర్తుచేశారు.

US Election 2020: Hindu Sena Offers Special Prayers for Donald Trump’s Victory

పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ ల కుట్రలకు వ్యతిరేకంగా భారత్ చేస్తోన్న పోరాటానికి ట్రంప్ సాయపడతారని, అందుకే ఆయన గెలవాలని కోరుతున్నట్లు హిందూ సేన సభ్యులు చెప్పారు. గత (2016) ఎన్నికల సమయంలోనూ ట్రంప్ కోసం చేసిన పూజలు ఫలించాయని, ఈసారి కూడా ఫలితాలు పునరావృతం అవుతాయని వారు తెలిపారు.

అమెరికాలో అర్హులైన ఓటర్ల సంఖ్య మొత్తం 23కోట్ల,92లక్షల,47వేల182 కాగా, అందులో సుమారు 1కోటి మంది ఇప్పటికే ముందస్తుగా ఓటేశారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, చాలా చోట్ల తెల్లవారుజాము నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద జనం క్యూలు కట్టడం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+