• search

పాకిస్తాన్ కు భారత్‌, అమెరికా ఘాటు హెచ్చరిక, టిల్లర్సన్ తో మోడీ, సుష్మా భేటీ

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌, అమెరికా దృఢచిత్తాన్ని పునరుద్ఘాటించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే సహించబోమంటూ ఇరు దేశాలు పాకిస్తాన్‌కు ఘాటైన హెచ్చరికలు చేశాయి.

  పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించాయి. మరోవైపు, భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపన వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని కూడా భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి.

  పాకిస్తాన్ చర్యలను సహించబోం...

  పాకిస్తాన్ చర్యలను సహించబోం...


  భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ బుధవారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా, హెచ్‌-1బీ వీసాలు, దక్షిణాసియాపై ట్రంప్‌ నూతన విధానం సహా పలు అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త విలేకర్ల సమావేశంలో పాల్గొన్న టిల్లర్సన్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు సురక్షిత ఆవాసాలు కల్పించడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు బలం పుంజుకుంటే పాక్‌ స్థిరత్వానికే ముప్పు ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు పలికారు.

  అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో...

  అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో...

  అభివృద్ధి పనుల ద్వారా అఫ్గాన్‌ పునర్నిర్మాణంలో భారత్‌ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందంటూ కొనియాడారు. బలమైన శక్తిగా భారత్‌ అవతరించడంలో తాము మద్దతుగా నిలుస్తామని టిల్లర్సన్‌ పేర్కొన్నారు. ఎఫ్‌-16, ఎఫ్‌-18 యుద్ధ విమానాలతోపాటు సైన్యం ఆధునికీకరణకు అవసరమైన అత్యుత్తమ సాంకేతికతలన్నింటినీ భారత్‌కు అందజేస్తామని తెలిపారు.

  మార్పులు తీసుకువచ్చేముందు..

  మార్పులు తీసుకువచ్చేముందు..

  పాకిస్తాన్ తారతమ్యాల్లేకుండా అన్ని ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. దక్షిణాసియాపై ట్రంప్‌ నూతన విధానం విజయవంతమవుతుందని సుష్మాస్వరాజ్‌ సూచించారు. ఈ సందర్భంగా హెచ్‌-1బీ వీసా అంశంపై కూడా టిల్లర్సన్‌తో మాట్లాడానని ఆమె తెలిపారు. వీసా నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చేముందు.. అమెరికా ఆర్థికరంగం ఎదుగుదలలో భారత ఐటీ నిపుణుల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరానన్నారు.

  ఆ దేశంతో అల్పస్థాయి సంబంధాలే...

  ఆ దేశంతో అల్పస్థాయి సంబంధాలే...

  టిల్లర్సన్‌-స్వరాజ్‌ చర్చల్లో ఉత్తర కొరియా అంశం కూడా చర్చకు వచ్చింది. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు తగ్గించుకోవడం, దౌత్య కార్యాలయాన్ని మూసివేయడం వంటి అంశాలపై తాము చర్చలు జరిపామని సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు. ఉత్తర కొరియాతో భారత్ అల్పస్థాయి వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నట్లు టిల్లర్సన్‌కు తెలియజేశానన్నారు.

  భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతం...

  భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతం...

  సుష్మా స్వరాజ్ తో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతోనూ టిల్లర్సన్‌ సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరాటం, అఫ్గానిస్తాన్ లో శాంతిస్థాపన వంటి అంశాల్లో భారత్‌, అమెరికా ఉమ్మడిగా కృషిచేస్తున్నట్లు సమావేశంలో మోడీ పేర్కొన్నారు. భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతం ఇరుదేశాలపైనేగాక మొత్తం ప్రపంచ స్థిరత్వంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా మోడీ, టిల్లర్సన్‌ ఉద్ఘాటించారు.

  English summary
  India’s foreign minister defended the country’s ties with North Korea and Iran during talks on Wednesday with Secretary of State Rex Tillerson aimed at building robust relations between the two giant democracies. The Trump administration has launched a new U.S. effort to deepen military and economic ties with India as a way to balance China’s assertive posture across Asia. At the talks with Indian Foreign Minister Sushma Swaraj, both sides pledged to strengthen anti-terrorism cooperation and Tillerson said Washington stood ready to provide India with advanced military technology.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more