ట్రంప్ వ్యాఖ్యలపై దుమారం

Donald Trump: భారత్‌కు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) నిధుల నిలిపివేత వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. తీవ్ర రాజకీయ చర్చకు కేంద్రబిందువు అయింది. దేశంలో ఓటర్ల సంఖ్యను ప్రభావితం చేయడానికి యూఎస్ఎయిడ్ నిధులను ఉపయోగించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించింది.

దేశంలో యూఎస్ఎయిడ్ ఆర్థిక ప్రమేయం అభివృద్ధి ప్రాజెక్టులకే పరిమితమని, ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో భాగంగా యూఎస్ఎయిడ్ నిధుల నిలిపివేతను కాంగ్రెస్ పార్టీ రాజకీయ అంశంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

USAID funding row India has sparked a heated political debate

ఆర్థిక శాఖ అందజేసిన 2023-24 వార్షిక నివేదిక ప్రకారం.. దేశంలో ఏడు ప్రాజెక్టుల్లో యూఎస్ఎయిడ్ పాలుపంచుకుంది. మొత్తం నిధులు సుమారు 750 మిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ప్రధానంగా వ్యవసాయం, నీటి సరఫరా, పారిశుధ్యం, పునరుత్పాదక విద్యుత్ విపత్తు నిర్వహణ, ఆరోగ్య రంగాలకు సంబంధించినవే.

ఓటర్ల సంఖ్యను పెంచే కార్యక్రమాలకు ఈ నిధులను కేటాయించినట్లు ఎక్కడే గానీ ప్రస్తావించలేదనే విషయం ఇక్కడ గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలకు విరుద్ధంగా- దర్యాప్తు నివేదికలు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే 2022లో బంగ్లాదేశ్‌కు ఈ 21 మిలియన్ డాలర్లను కేటాయించినట్లు స్పష్టమైంది. ఇందులో- 13.4 మిలియన్ డాలర్లను ఇదివరకే చెల్లించినట్లు తేలింది కూడా.

ఈ స్థాయిలో స్పష్టత ఉన్నప్పటికీ- ట్రంప్ తన వైఖరిని పునరుద్ఘాటించడం ప్రాధాన్యతను సంతరించుకంటోంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా.

భారత్‌లో యూఎస్ఎయిడ్‌ ప్రాజెక్టులపై విశ్వాసం ఉందని, ఎన్నికల జోక్యం అంటూ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జైశంకర్ తేల్చి చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ట్రంప్ వాదనలపై స్పందించింది. ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరమని వ్యాఖ్యానించింది. దేశ ఎన్నికల ప్రక్రియ స్వతంత్రంగా, సార్వభౌమాధికారంతో పని చేస్తుందనీ పునరుద్ఘాటించింది.

ఈ వివరణలతో యూఎస్ఎయిడ్ వివాదం ముగియాల్సి ఉండాల్సి ఉన్నప్పటికీ- ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం రాజకీయంగా వినియోగించుకుంటోంది. ఎన్నికల ప్రక్రియలో విదేశీ నిధుల సహకారం ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వంపై దాడి చేస్తోంది. భారత వ్యతిరేక అజెండాను తెరమీదికి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.

కాంగ్రెస్.. ఇలా అంతర్జాతీయ సంస్థలతో జతకట్టడం ఇదే మొదటిసారి కాదని పలువురు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, దేశ వ్యాపార, వాణిజ్య రంగాలను అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ తరచూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ నివేదికలను ఉపయోగించుకుంటూ వచ్చింది.

USAID funding row India has sparked a heated political debate

పెగాసస్ స్పైవేర్ వివాదం, అప్పట్లో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు రెండూ ఓసీసీఆర్‌పీ నివేదికల ద్వారా ఆజ్యం పోశాయి. వీటిని కాంగ్రెస్ నాయకులు- ప్రత్యేకించి రాహుల్ గాంధీ, దేశ ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి వినియోగిస్తోన్నారు. రాహుల్ గాంధీకి బంగ్లాదేశ్ జర్నలిస్ట్, మాజీ ఓసీసీఆర్పీకి చెందిన ముష్ఫికుల్ ఫజల్ అన్సారీతో సంబంధం ఉండటం గమనార్హం.

2024లో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముష్ఫికుల్ ఫజల్ రాయబారిగా నియమితులయ్యారు. ఈ చర్య- దక్షిణాసియాను అస్థిరపరచడానికి పని చేస్తున్న ప్రపంచ సంస్థలతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం గురించి ఆందోళనలను లేవనెత్తినట్టయింది.

1954లో ఆసియా ఫౌండేషన్ ఓ సీక్రెట్ సీఐఏ ఆపరేషన్‌ తెరమీదికి వచ్చింది. దీనికి జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌లో భాగమైన ఫోర్డ్ ఫౌండేషన్ నిధులు సమకూర్చింది. ఇది చారిత్రాత్మకంగా జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరికి బాహటంగా మద్దతు ఇచ్చినట్లు తేలింది. అటువంటి సంస్థలతో కాంగ్రెస్ పరోక్షంగా పొత్తు పెట్టుకోవడం దేశ సార్వభౌమాధికారం పట్ల దాని నిబద్ధత గురించి అనేక అనుమానాలను లేవనెత్తుతోంది.

జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (ఓఎస్ఎఫ్) ద్వారా భారీగా నిధులు సమకూర్చుతోన్న ఫ్రీడమ్ హౌస్.. 2021 నుండి భారత్‌లో పాక్షిక స్వేచ్ఛగా పని చేస్తోందంటూ ముద్ర వేసింది. ప్రభుత్వం మైనారిటీలను అణచివేస్తోందని ఆరోపిసింది. ఫ్రీడమ్ హౌస్ యూఎస్ ఆధారిత సంస్థ అయినప్పటికీ- యూఎస్ఎయిడ్‌తో భాగస్వామ్యం కలిగి ఉండటం చర్చనీయాంశం.

యూఎస్ఎయిడ్ అండతో ఏర్పడిన కన్సార్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ (CEPPS) ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలను ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు- 2014 ఎన్నికల సమయంలో సీఈపీపీఎస్ ద్వారా ఓటర్ ప్రాజెక్ట్ కోసం యూఎస్ఎయిడ్ భారత్‌కు 21 మిలియన్ డాలర్లను పంపిందని నివేదికలు చెబుతున్నాయి.

భారత్‌ను ఓ ప్రత్యేక ఆందోళనకర దేశంగా వర్గీకరించడానికి ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ లాబీయింగ్ చేస్తోన్న యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం పదే పదే ప్రయత్నించింది. యూఎస్‌కు చెందిన కొన్ని గ్రూపుల సహకారంతో జరిగిన ఈ లాబీయింగ్.. ప్రపంచ వేదికలపై భారత ప్రతిష్ఠన మసకబార్చడానికి ఉపయోగించినట్లు నిర్ధారించింది.

ఎన్నికలు, పాలనా ప్రక్రియలను విదేశీ సంస్థలు నిర్దేశించబోవంటూ పదే పదే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూఎస్ఎయిడ్ నిధులపై విదేశాంగ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు వివరణాత్మకంగా స్పష్టం చేయడం, ఎన్నికల ప్రక్రియలో ఈ ఎయిడ్ జోక్యం ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ- కాంగ్రెస్ మాత్రం ఇందులో ఎలా భాగస్వామిగా ఉంటోందనే విషయాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం బయటపెట్టింది.

ప్రజాస్వామ్య నియమాలను పాటిస్తోన్నట్లు చెప్పుకుంటూనే కాంగ్రెస్ మాత్రం విదేశీ సంస్థలకు సహకరించడానికి ముందుకు వస్తోందటం, చాలా వరకు నిఘా సంస్థలతో సంబంధాలు, స్వార్థ భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉండటం.. ఆ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇది ఆందోళనకరంగా పరిణమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+