వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫినాయిల్ వద్దు, గోమూత్రంతో ఆఫీసులను శుభ్రం చేయండి: మేనకా గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాల శుద్ధికి రసాయనాలతో కూడిన ఫినాయిల్‌కు బదులు గోమూత్రంతో తయారు చేసిన ద్రవం గౌనిల్‌ను వినియోగించాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధిశాఖ మంత్రి మేనకా గాంధీ సూచించారు. రసాయనాలతో తయారైన ఫినాయిల్ వాడకం వల్ల పర్యావరణానికి ప్రతికూలమని ఇతర శాఖల మంత్రులకు రాసిన లేఖలో తెలిపారు.

గౌనిల్ వాడకం పర్యావరణానికి ఎంతో అనుకూలమని ఇతర మంత్రులకు చెప్పారు. కేంద్ర గోదాముల్లో గౌనిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. దీన్నీ హోలీ కౌ ఫౌండేషన్ అనే సంస్థ మార్కెట్ చేస్తోంది.

Use cow urine to clean offices, says Maneka Gandhi

‘వాతావరణానికి హాని కలిగించే రసాయనిక ఫినాయిల్‌కు బదులు పర్యావరణ అనుకూలమైన గౌనిల్‌ను ప్రభుత్వ కార్యాలయాల శుభ్రతకు ఉపయోగించండి' అని సహచర మంత్రులకు మేనకా గాంధీ సూచించారు. తక్కువ ధరలో వస్తున్న గౌనిల్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయల్లోని ఫ్లోర్, టాయ్‌లెట్లను ఆవు మూత్రంతో తయారు చేసిన గౌనిల్‌తో శుభ్రపరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపారు. కాగా, ఇటీవల ఆయూష్ మంత్రి శ్రీపాల్ నాయక్ కూడా ఇదే మాట చెప్పారు. చాలా ఔషధ కంపెనీలు గో మూత్రం నుంచే వివిధ వ్యాధులకు ఔషధాలను తయారు చేస్తున్నాయని తెలిపారు.

English summary
Move over phenyl, gaunyle is here. Union minister Maneka Gandhi has asked her ministerial colleagues to opt for a "natural disinfectant'' made from extracts of cow urine instead of the "chemically bad'' one in government offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X