ఘోర ప్రమాదం: బస్సు దూసుకెళ్లడంతో ఆరుగురు విద్యార్థులు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications