బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు: లవ్ మ్యారేజ్: బామ్మర్దితో కలిసి

లక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు కౌశల్ కిషోర్ కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు. హైఅలర్ట్‌ను ప్రకటించారు. వాహనాలను తనిఖీ చేస్తోన్నారు. కాల్పుల ఘటనపై రాజకీయంగా కలకలం చెలరేగింది. దీనికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ కౌశల్ కిషోర్.. మోహన్‌లాల్ గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆయన కుమారుడు ఆయుష్.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం లేదు. అయినప్పటికీ- ఇంట్లో వారిని ఎదిరించి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. లక్నోలోని భిటౌలీ ప్రాంతంలో నివాసం ఉంటోన్నారు. బుధవారం తెల్లవారు జామున ఆయన తన బావమరిదితో కలిసి వెళ్తోండగా.. లక్నో మడియావా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

 Uttar Pradesh: BJP MP Kaushal Kishores son shot at in Lucknow, probe underway

ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ఆయుష్ ఛాతీకి తగిలింది. వెంటనే ఆయనను ట్రౌమా కేర్ సెంటర్‌కు తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయుష్ బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనకు కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని లక్నో నార్త్ జోన్ డీసీపీ రయీస్ అఖ్తర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+