యూపీలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఎన్ కౌంటర్-ఎస్టీఎఫ్ కు సీఎం యోగీ ప్రశంసలు..
యూపీలో సంచలనం రేపిన ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్.. తాజాగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో అసద్ అహ్మద్‌తో పాటు మరో వ్యక్తి గులాం కూడా చనిపోయాడు. అతని తలపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది. ఉమేష్ పాల్ హత్య కేసుకు సంబంధించి అసద్ అహ్మద్, గులాం ఎన్‌కౌంటర్ జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది.
ఉమేష్ పాల్ హత్య కేసులో ఎన్ కౌంటర్లో చనిపోయిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం రాష్ట్ర శాంతిభద్రతలపై చర్చించేందుకు సీఎం యోగి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారులను, చట్టబద్ధమైన పాలనను కాపాడేందుకు వారు చేస్తున్న కృషిని కొనియాడారు. మరోవైపు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ కూడా ఎస్టీఎఫ్ బృందానికి అభినందనలు తెలిపారు.

ఎన్ కౌంటర్లో హతులైన అసద్, గులాం ఇద్దరి తలపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని యూపీ స్పెషల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఝాన్సీలోని పరీక్షా డ్యామ్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ వివరాలు ఆయన వెల్లడించారు. మృతులిద్దరూ ఆ ప్రాంతంలో దాక్కున్నారని, అతిక్ అహ్మద్ సన్నిహితుడు వారికి ఆశ్రయం కల్పిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో పోలీసు బృందాలు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications