యోగి ఆదిత్యనాథ్‌కు కొవిడ్ వ్యాక్సిన్ -తొలి డోసు తీసుకున్న యూపీ సీఎం -వైరస్ కట్టడికి కఠిన చర్యలు
దేశంలో కరోనా వైరస్ మరోసారి వీరవిహారం చేస్తున్నది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోనూ పెద్ద ఎత్తున కొత్త కేసులు వస్తూ, మూడు నెలల గరిష్టానికి యాక్టివ్ కేసులు చేరాయి. మహమ్మారి కట్టడి కోసం అక్కడి కఠిన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సగుతున్నది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (48) కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. లక్నోలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఉదయం నర్సులు ఆయనకు తొలి టీకా డోసు వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు, రెండో డోసుకు ఎప్పుడు రావలన్నది సీఎంకు నర్సులు సూచనలు చేశారు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 45 ఏళ్లు దాటిన అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోనేలా చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం తెలిసిందే.

యూపీలో కరోనా వైరస్ కొత్త కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన లెక్కల ప్రకారం శనివారం ఒక్కరోజే 4,136 కొత్త కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,30,059కి, మొత్త మరణాల సంఖ్య 8,881కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,738గా ఉంది. కేసులు పెరుగుతుండటంతో..
కోవిడ్ వ్యాప్తి చెందకుండా పలు నియమ నిబంధనలు అమలు చేస్తోంది యూపీ సర్కార్. ఏ ప్రాతంలోనైనా ఒక్క వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిస్తే ఆ చుట్టుపక్కల గల 20 ఇళ్లకు సీల్ వేస్తూ ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ తివారీ జిల్లా అధికారులు, పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అపార్ట్‌మెంట్ లో కరోనా పాజిటివ్ వ్యక్తి ఉంటే.. ఆ అపార్ట్‌మెంట్ మొత్తాన్ని సీల్ చేయనున్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్ పూర్తయిన తర్వాతే దానిని కంటైన్‌మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించనున్నారు.












Click it and Unblock the Notifications