వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊర కుక్క కరిచింది: తుపాకితో కాల్చేసిన ఎస్ఐ

|
Google Oneindia TeluguNews

లక్నో: పోలీసులకు కోపం వస్తే ఎవరినైనా తుపాకితో కాల్చేస్తారని మరో సారి వెలుగు చూసింది. అయితే ఈ సారి ఓ ఊరకుక్కను ఎస్ ఐ కాల్చిపారేశారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆదేశించారు.

లక్నోలోని చిన్హాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ నగర్ లో సబ్ ఇన్ స్పెక్టర్ మహేంద్ర ప్రతాప్ నివాసం ఉంటున్నారు. ఈయన డ్యూటీలో ఉండగా ఓ ఊరకుక్క కరించింది. వెంటనే మహేంద్ర ప్రతాప్ ఇంటికి వెళ్లి లైసెన్స్ డ్ తుపాకి తీసుకువచ్చి తనను కరిచిన ఊర కుక్కను కాల్చిపారేశాడు.

Uttar Pradesh cop shoots dog after it bites him

ఎస్ఐ కాల్చిన కుక్క ఆపరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించడం లేదని కథనాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న జంతు హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ మీద కేసు నమోదు చెయ్యడానికి పోలీసులు నిరాకరించారు.

జంతు సంరక్షణ బోర్డు సభ్యులైన కమ్నా పాండే ఈ విషయాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

English summary
Sub-inspector Mahendra Pratap, a resident of Adarsh Nagar in Chinhat was heading for Barabanki for his duty when the dog bit him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X