వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూప్‌ చంద్రపాండే- యోగీని గట్టెక్కించేందుకు బీజేపీ అస్త్రం- కొత్త ఎన్నికల కమిషనర్‌గా

|
Google Oneindia TeluguNews

కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలకు తొమ్మిదినెలలే సమయం ఉన్న నేపథ్యంలో బీజేపీ కష్టాలు పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం యోగీని అనూహ్యంగా సీఎంగా ఎంపిక చేసిన బీజేపీకి ఇప్పుడు ఐదేళ్ల పాలనలో ఆయన నిర్ణయాల్ని సమర్ధించుకోవడం అంతే కష్టంగా మారింది. దీంతో మరోసారి బీజేపీని అదికారంలోకి తెచ్చేందుకు కేంద్రం రకరకాల అస్త్రాల్ని ప్రయోగిస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్‌గా ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌ 1984 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అనూప్‌ చంద్రపాండేను నియమించడం వెనుక ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలే లక్ష్యమన్న వాదన వినిపిస్తోంది. యూపీలో బీజేపీ గట్టెక్కాలంటే ఎన్నికల సంఘఁలో తమ మనుషులు ఉండాలని బీజేపీ భావించడం వల్లే అనూప్ చంద్ర కమిషనర్‌ అయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2018లో యోగీ సర్కార్‌ రూ.613 కోట్ల వ్యయంతో అమలు చేసిన గోసంరక్షణ ప్రాజెక్టులో అనూప్‌ చంద్ర కీలకపాత్ర పోషించారు. యూపీ సీఎస్‌గా కూడా పనిచేసిన పాండేను కేంద్రం ఎన్నికల కమిషనర్‌గా నియమించడం, ఆయన విధుల్లో చేరడం చకచకా జరిగిపోయాయి.

Uttar Pradesh elections 2022: Anup Chandra Pandey appointed election commissioner

Recommended Video

PM Modi To Virtually Inaugurate Construction Of Agra Metro Project Today

తాజాగా కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసి ఛీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ కాకుండానే తప్పుకున్న అశోక్‌ లావాసా కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు అనుకూలంగా ఈసీ వ్యవహరించడంపై అసంతృప్తితో వైదొలిగారు. ఆ తర్వాత మరో కమిషర్‌ అచల్‌ కుమార్ జ్యోతి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన కూడా 2018లో రిటైర్‌ అయ్యారు. ఇప్పుడు యూపీకి చెందిన అనూప్‌ చంద్రపాండే కూడా కేంద్రంలోని బీజేపీ నేతలో సత్సంబంధాలు కలిగిన వారే కావడంతో ఆయన్ను యూపీ ఎన్నికల కోసమే కమిషనర్‌గా తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Anup Chandra Pandey, a retired 1984-batch IAS officer from the Uttar Pradesh cadre, has been appointed election commissioner about nine months before Assembly elections are due in the heartland state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X