వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ పోరు - మారని ఓటర్ల తీరు- 2017 ఎన్నికలతో సమానంగా పోలింగ్ శాతాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే ఆరుదశల పోలింగ్ పూర్తయింది. మరో దశ పూర్తయితే ఎన్నికలు ముగిసినట్లే. ఇప్పటివరకూ జరిగిన ఆరు దశల ఎన్నికల్ని గమనిస్తే గతంలో నమోదైన పోలింగ్ శాతాలకు దాదాపు దగ్గరగా ఉండటం విశేషం. అంటే ఈ ఐదేళ్లలో ఓటు వేసే విషయంలో ఓటర్ల వైఖరుల్లో పెద్దగా తేడా లేదని తెలుస్తోంది.

యూపీ ఎన్నికల్లో భాగంగా రెండు రోజుల క్రితం జరిగిన ఆరోదశ ఎన్నికల్లో 55 శాతం పోలింగ్ నమోదైంది. 2017లో ఇవే ప్రాంతాల్లో 56.52 శాతం పోలింగ్ నమోదైంది. అంతే కాదు గత ఐదు దశల ఎన్నికల్లోనూ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కేవలం 0.3 శాతం మాత్రమే తగ్గింది. అంటే 2017కూ, 2022కూ మధ్య ఓటర్ల వైఖరుల్లో పెద్దగా మార్పు లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూపీలోని పశ్చిమ ప్రాంతంతో ప్రారంభమై తూర్పు దిశగా సాగిన మొదటి రెండు దశల్లో పోలింగ్ శాతం 2017 కంటే కొంచెం తక్కువగా నమోదైంది. మూడు నుంచి ఐదు దశల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది.

 Uttar Pradesh Elections 2022 : voter turnout reaching figures of 2017 polls

గతంతో పోలిస్తే ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచారంపై కోవిడ్ ఆంక్షల ప్రభావం పడింది.
పంజాబ్ లో 2017తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం దాదాపు 6 శాతం తగ్గింది. ఉత్తరాఖండ్ తో 2017తో పోలిస్తే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. గోవాలో అయితే ఏకంగా మూడు శాతం మేర పోలింగ్ తగ్గింది. మణిపూర్ లో పోలింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఐదు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈసారి సగటు పోలింగ్ శాతం 62.092గా ఉంది. 2017తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం దాదాపు సగటుకు దగ్గరగా ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఓటర్ టర్న్ అవుట్ యాప్ లో గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుంటోంది. తుది ఓటర్ల సంఖ్య గణాంకాలు పోలింగ్ పూర్తయిన తర్వాత ఫారం 17-సిలో పోలింగ్ ఏజెంట్లకు అందిస్తారు. ఈసీ గణాంకాల ప్రకారం ఓటర్ టర్నౌట్ యాప్ అన్ని రిటర్నింగ్ అధికారులు నమోదు చేసిన తర్వాత పోలింగ్ శాతం చూపిస్తుంది. అలాగే సాధారణంగా పోలింగ్ ముగిశాక తర్వాత రోజు ఉదయానికి పూర్తవుతుంది. కొన్ని ప్రాంతాలలో, కొండ ప్రాంతాల మాదిరిగా, తుది పోలింగ్ శాతాలు రావాలంటేచేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని వర్గాలు తెలిపాయి.

English summary
voter turnout in ongoing utta pradesh polls has been almost similiar to the uttar pradesh elections in 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X