కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం: ఉత్తరప్రదేశ్‌లో నైట్‌కర్ఫ్యూ ఎత్తివేత

న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్తీ ఫిబ్రవరి 19 నాటి నోటీసులో కోవిడ్ -19 కేసుల తగ్గుదల కారణంగా రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసినట్లు పేర్కొన్నారు.

Recommended Video

    Assembly Elections 2022: Rallies, Road Show లకు EC నో.. | Oneindia Telugu

    ఆ నోటీసు ప్రకారం.. శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ ఎత్తివేశారు. గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ విధించారు.

    Uttar Pradesh Government Lifts Night Curfew After Decline In Covid-19 Cases

    ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కోవిడ్-19 మూడవ వేవ్ వ్యాప్తి చెందడంతో, జనవరి 9 నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి కర్ఫ్యూను రెండు గంటలు పొడిగించారు. ఉత్తర్‌లోని మొత్తం 75 జిల్లాల్లో విధించారు.

    అయితే, ఫిబ్రవరి 13న, గైడ్‌లైన్‌ను సవరించారు. మరోసారి, కర్ఫ్యూ సమయాలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 842 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    ఇది ఇలావుండగా, దేశంలోనూ కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలను సండలించడం, ఎత్తివేయడం చేస్తున్నాయి. దేశంలో
    గత 24 గంటల్లో 22, 270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది.

    ప్రస్తుతం దేశంలో 2,53,739 యాక్టీవ్ కేసులున్నాయని, 0.59 శాతంగా యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. 1.80 శాతానికి రోజువారీ పాజిటివిటి రేటు చేరుకుందని, దేశంలో ఇప్పటివరకు 4,28,02,505 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 5,11,230కి చేరుకుందని తెలిపింది. దేశంలో 98.21 శాతంగా కరోనా రికవరీ రేటు ఉందని తెలిపింది. ఒక్క రోజులో కరోనా నుంచి 60,298 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని, దీంతో కోలుకున్న వారి సంఖ్య 4,20,37,536 చేరుకుంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

    దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 175.03 కోట్ల డోసుల టీకాలు అందజేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం 36,28,578 డోసుల టీకాలు వేసినట్లు, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 175,03,86,834 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+