వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి ఆపిన ‘బుల్లెట్’.. బైక్ కోసం వరుడి నానా యాగీ, గుర్రం దిగీ మరీ హంగామా..

|
Google Oneindia TeluguNews

వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇదీ ఇటీవల వచ్చిన ఓ తెలుగు మూవీలోని పాట. బాగా పాపులర్ కూడా అయ్యింది. అయితే బుల్లెట్ బైక్ అంటే అంతే మరీ. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఉంటుంది. అందరూ తెగ ఇష్టపడుతుంటారు. ఆ బండి అంటే రాజసం.. రాయల్ లుక్ ఉంటుంది. సౌండ్ కూడా బాగుంటుంది. దీంతో బుల్లెట్ అంటే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

డ్రెస్ విప్పేసి నానా హంగామా..

డ్రెస్ విప్పేసి నానా హంగామా..

పెళ్లిలో వరుడికి బైక్ ఇస్తుంటారు. కారు ఇస్తుంటారు. బంగారు గొలుసు పెడతాం అని చెబుతారు. వధువు తరపువారు మాట ఇస్తుంటారు. మాట ఇచ్చి ఇవ్వకుంటే కొందరు పెళ్లి కొడుకులు అలుగుతుంటారు. అత్తింటివారు ఏదో లాంఛనంగా ఇస్తానన్నది ఇవ్వకపోతే సరిపెట్టుకుని పెళ్లి చేసుకుని కనీసం ఆ తరువాతైనా ఇవ్వండీ అని సర్ధుకుని పెళ్లి చేసుకునేవాళ్లను చూసి ఉంటాం. ఓ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లి ఊరేగింపులో నానా హంగామా చేశాడు. ఊరేగింపుగా వస్తున్న వరుడు గుర్రంపైనుంచి దూకేసి పెళ్లి డ్రెస్ విప్పేసి నానా హంగామా చేశాడు.

అపాచీ బైక్ తేవడంతో..

అపాచీ బైక్ తేవడంతో..


వరుడికి అత్తింటివారు బుల్లెట్ బైక్ ఇస్తానని చెప్పి మాట తప్పారు. వారు అపాచీ బైక్ ఇవ్వటంతో వరుడు పెళ్లి ఊరేగింపులో రచ్చ రచ్చ చేశాడు. ఈ ఘటన యూపీలోని హత్రాస్‌లో జరిగింది. అమర్‌పురఘనా ప్రాంతంలో వరుడు పెళ్లి ఊరేగింపులో ఆగ్రహంతో ఊగిపోయాడు. కట్నం కింద ఇస్తామన్న బులెట్ బదులు అపాచి బైక్ ఇవ్వటంతో కోపంతో ఊగిపోయాడు. ఏకంగా పెళ్లి అలకరణంతో గుర్రం మీద ఊరేగింపుగా వస్తున్న సమయంలో గుర్రంపై నుంచి దూకేశాడు. అక్కడితో ఊరుకోకుండా.. పెళ్లి దుస్తులను విప్పేసి నానా హంగామా చేశాడు. అది చూసిన వధువు తరపువారు కంగారుపడిపోయారు.

వీలు చూసుకుని ఇస్తాం అని చెప్పినా..

వీలు చూసుకుని ఇస్తాం అని చెప్పినా..


వీలు చూసుకుని ఇస్తాం బాబూ అల్లరి చేయకు మా పరువు పోతుందని బతిమాలుకున్నారు. కానీ అతని వినలేదు. విషయం కాస్తా పోలీసులకు తెలియటంతో సంఘటనా స్థలానికి చేరుకుని వరునితోపాటు అతని తండ్రి, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లికి ముందే వీరు అసలు రూపం బయటపడింది. పెళ్లి తరువాత కూతురిని వేధించేవారిలా ఉన్న పెళ్లి మాకు వద్దని వధువు తండ్రి తేల్చి చెప్పేశాడు. కేవలం బైక్ కోసం ఇంత రాద్దాతం చేసే ఇటువంటివాడికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే తరువాత ఇంకెన్ని రకాలుగా వేధిస్తాడోనని భావించాడు. దీంతో ఈ పెళ్లి ఇష్టం లేదంటూ తేల్చిచెప్పేశాడు. వధువు కూడా తండ్రికి సపోర్ట్ చేసింది. తండ్రిని ఇంతగా అవమానించినవాడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది.

రూ.10 లక్షల కట్నం..

రూ.10 లక్షల కట్నం..


అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామానికి చెందిన యువకుడు లక్నోలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి హత్రాస్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమయ్యింది. రూ. 10 లక్షల కట్నం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. వరుడు తనకు బుల్లెట్ వాహనం కావాలని కోరాడు. అయితే వధువు తరపువారు అపాచీ బైక్ కొనుగోలు చేశారు. పెళ్లి వేడుక ప్రారంభమయ్యింది. వరుడు గుర్రం మీదకు ఎక్కి, ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో అక్కడున్న వారెవరో వరునితో బులెట్ బదులు అపాచీ వాహనం కొన్నారని చెప్పారు.

దాటిన ముహూర్తం

దాటిన ముహూర్తం

మాట విన్నవెంటనే వరుడు ఆగ్రహంతో ఊగిపోతూ, గుర్రం మీద నుంచి దిగి, పెళ్లి దుస్తులు విప్పేసి, టీ షర్టు, ప్యాంటు ధరించి ఒక రూమ్ లోకి వెళ్లి కూర్చున్నాడు. దీనిని చూసిన పెళ్లివారంతా కంగారు పడిపోయారు. పెళ్లి కోలాహలమంతా ఆగిపోయింది. బుల్లెట్ ఇవ్వకపోతే పెళ్లి జరగదంటూ వరుడు... వధువు తరపువారికి తెలిపాడు. ఈ విషయాన్ని వధువు తరపువారు పోలీసులకు తెలియజేశారు. మరోవైపు వధువు కూడా ఇటువంటి పెళ్లి కొడుకు తనకు అవసరం లేదంటూ తెగేసి చెప్పింది. ఇంతలో వివాహ ముహూర్తం కూడా దాటిపోయింది. పెళ్లి తంతు కాస్త పీఎస్‌కి చేరింది. బుల్లెట్ బైక్ కాస్త పెళ్లిని ఆపివేసింది.

English summary
Uttar Pradesh groom demand Bullet bike for his marriage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X