కొత్త వ్యక్తులతో భార్య ఫోన్ లో బిజీబిజీ, చెప్పినా మాట వినలేదు, గొంతులు చీల్చి హత్యలు, డోంట్ కేర్ !

లక్నో: భార్య ఎక్కువగా కొత్త వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతుందని, తనను, పిల్లలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడకూడదని, లేనిపోని సమస్యలు వస్తాయని భర్త ఎంత చెప్పినా భార్య పట్టించుకోలేదని, అందుకే ఆ కుటుంబంలో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భార్య, పిల్లలతో సంతోషంగా !

భార్య, పిల్లలతో సంతోషంగా !

ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లోని అర్థాలాలోని షహిబబాద్ లోని సంజయ్ కాలనీలో నివాసం ఉంటున్న ధీరజ్ త్యాగి అనే వ్యక్తి అందమైన యువతిని వివాహం చేసుకున్నాడు. ధీరజ్ త్యాగి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన తరువాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాల వరకు ధీరజ్ త్యాగి అందరితో కలిసి సంతోషంగా ఉన్నాడు.

ఫోన్ కు అంకితం అయిన భార్య

ఫోన్ కు అంకితం అయిన భార్య

కొన్ని నెలల క్రితం భార్య ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో ఆమెకు ధీరజ్ త్యాగి స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు. స్మార్ట్ ఫోన్ తీసుకున్న తరువాత భార్య ఎక్కువగా కొత్త వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతున్నది. కొత్త వ్యక్తులతో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడటమే కాకుండా ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ సమయం కాలం గడపడం మొదలుపెట్టింది.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

కొత్త వ్యక్తులతో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడితే లేనిపోని సమస్యలు వస్తాయని, ఇక ముందు అలా చెయ్యకూడదని భర్త ధీరజ్ త్యాగి భార్యకు చాలాసార్లు చెప్పాడు. అయితే భార్య పట్టించుకోకపోవడంతో ఇంటిలో వివాదాలు మొదలైనాయి. నేను ఎవరితోనైనా ఎంతసేపైనా ఫోన్ లో మాట్లాడుకుంటానని, నువ్వు చెప్పిన మాట నేను వినను అని భార్య తేల్చిచెప్పింది. ధీరజ్ త్యాగికి భార్య మీద అనుమానం పెరిగిపోయింది.

అక్రమ సంబంధం ఉందని !

అక్రమ సంబంధం ఉందని !

తన భార్యకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని భర్త ధీరజ్ త్యాగికి అనుమానం మరింత పెరిగిపోయింది. ధీరజ్ త్యాగి ఈ విషయం భార్య కుటుంబ సభ్యులకు చెప్పినా వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో ధీరజ్ త్యాగి జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యకు బుద్ది చెప్పాలని ధీరజ్ త్యాగి నిర్ణయించుకున్నాడు. అయితే అది అతనికి సాధ్యం కాలేదు.

భార్య, పిల్లలను చంపేసి ఆత్మహత్య

భార్య, పిల్లలను చంపేసి ఆత్మహత్య

గురువారం రాత్రి భార్య చాలాసేపు వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతోంది. ఆ సమయంలో ధీరజ్ త్యాగి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన ధీరజ్ త్యాగి భార్య గొంతుకోసి చంపేశాడు. తరువాత పిల్లలను గొంతు కోసి చంపేసి బెడ్ రూంలో పడుకోబెట్టాడు. అనంతరం డెత్ నోట్ రాసిపెట్టిన ధీరజ్ త్యాగి బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బంధువులు వెళ్లే సరికి !

బంధువులు వెళ్లే సరికి !

శుక్రవారం ఎంత సేపటికి ధీరజ్ త్యాగి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా ఈ విషయం వెలుగు చూసిందని గాజియాబాద్ జిల్లా ఎస్పీ మనీష్ కుమార్ మిశ్రా మీడియాకు చెప్పారు. కొత్త వ్యక్తులతో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడకూడదని తన భార్యకు ఎంతచెప్పినా తన మాట వినలేదని, ఆమెను మందలించాలని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పినా వారు నిర్లక్షం చేశారని, అందుకే ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాని ధీరజ్ త్యాగి డెత్ నోట్ లో రాసిపెట్టాడని జిల్లా ఎస్పీ మనీష్ కుమార్ మిశ్రా వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+