5వేల అప్పు కోసం.. భార్యను ఫ్రెండ్ తో రేప్ చేయించిన భర్త
ఘజియాబాద్ : నరేష్.. పింటూ.. ఇద్దరు స్నేహితులు. టింకూ ఓ బట్టల దుకాణం పనిచేస్తున్న సమయంలో నరేష్ కు అతనితో స్నేహం ఏర్పడింది. నరేష్ కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో పింటూ వద్ద నుంచి నరేష్ రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు. దీంతో డబ్బులు తిరిగే చెల్లించే విషయంలో.. ఇద్దరి మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న నరేష్ టింకూను తమ ఇంటికి పిలిచాడు. ఆరోజు రాత్రి నరేష్ ఇంటి వద్దనే ఉండిపోయాడు పింటూ. ఇద్దరు కలిసి ఆ రాత్రి మద్యం సేవించారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మళ్లీ అప్పు గురించి ప్రస్తావన రాగా.. అప్పు తీర్చలేనని అందుకు బదులుగా తన భార్యను శారీరకంగా ఉపయోగించుకోవాలని నరేష్ పింటూతో చెప్పాడు.
దీంతో ఆ రాత్రి నరేష్ భార్యపై టింకూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం నరేష్ భార్య.. విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకురావడంతో అసలు విషయం వెలుగుచూసింది. "నా భర్త నరేష్ పింటూను మా ఇంటికి తీసుకొచ్చాడు.

ఇద్దరు కలిసి మద్యం సేవించాక.. పింటూ దగ్గర చేసిన అప్పు తీర్చడానికి బదులుగా, అది మాఫీ అయ్యేందుకు తన స్నేహితుడు పింటూతో నాపై అత్యాచారం చేయించాడు నా భర్త. విషయం ఎవరికైనా చెబితే మా తమ్ముళ్లను చంపేస్తామని బెదిరించారు' అంటూ అక్టోబర్ 1న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది నరేష్ భార్య. అత్యాచారం సమయంలో అడ్డు చెప్పినందుకు గాను నరేష్ తనను కొట్టినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, భార్య చేసిన ఫిర్యాదును ఖండించాడు నరేష్. అయితే నరేష్ భార్యను లైంగికంగా వేధించిన విషయాన్ని పింటూ పోలీసుల ఎదుట ఒప్పుకోవడం గమనార్హం. భార్యపై పింటూ అత్యాచారం చేస్తోన్న సమయంలో ఇంటి బయట నరేష్ కాపలాగా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నరేష్ భార్య అత్యాచారానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు వచ్చాక తదుపరి విచారణను కొనసాగించనున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications