సిబ్బందితో చెప్పులు తుడిపించుకున్న మంత్రి, ఆయన ఏం చెప్పారంటే?
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ మంత్రి తన సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు మంత్రి వివరణ ఇచ్చారు. తాను ఎవరితోను చెప్పులు తుడిపించుకోలేదని, తానే శుభ్రం చేసుకున్నానని చెప్పారు.
మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కన విడిచిపెట్టిన చెప్పులపై పడిన మట్టి, నీళ్లను సిబ్బంది తువ్వాలుతో శుభ్రం చేశారు.

దీనిని మీడియా ప్రసారం చేసింది. ఆ తర్వాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుమారం చెలరేగింది. మంత్రి ఇలా ప్రవర్తించడంపై చాలామంది మండిపడ్డారు. దీంతో సదరు మంత్రి వివరణ ఇచ్చారు.
తాను చెప్పులను శుభ్రం చేయాల్సిందిగా సిబ్బందికి చెప్పలేదని తెలిపారు. నీళ్లు, మట్టి పడటంతో తన చెప్పులను తానే శుభ్రం చేసుకున్నానని అన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications