Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీ అంతా కప్పల తక్కెడే: హంగ్ అసెంబ్లీ కొత్తేం కాదు

దేశంలోకెల్లా అతిపెద్దదైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రంలో గత 25 ఏళ్లకు పైగా ప్రజలు అస్పష్ట తీర్పునివ్వడం సహజ పరిణామం.

న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్దదైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రంలో గత 25 ఏళ్లకు పైగా ప్రజలు అస్పష్ట తీర్పునివ్వడం సహజ పరిణామం. 2012లో అఖిలేశ్ యాదవ్, అంతకుముందు 2007లో మాయావతి మినహా ఏ సీఎం కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. దీనివల్లే 25 ఏళ్లకు పైగా రాష్ట్ర ప్రజలు ఇస్తున్న అస్పష్ట తీర్పు ఇస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలోని అత్యంత సంక్లిష్టమైన రాజకీయ పరిణామాల నేపథ్యానికి తోడు తొలి నుంచి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే వచ్చింది. 1951లో గోవింద్ వల్లబ్ పంత్ మొదలు చరణ్ సింగ్ వరకూ యంగ్ టర్క్‌లు, సోషలిస్టుల మద్దతుతో ఏర్పాటైన పలు ప్రభుత్వాల మనుగడ కొద్ది కాలమే సాగింది. తొలిసారి 1967లో జన్ సంగ్, సీపీఎం మద్దతుతో కాంగ్రెసేతర ప్రభుత్వానికి అధినేతగా చరణ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.

1980లో తిరిగి కేంద్రంలో ఇందిరాగాందీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీపీ సింగ్ కూడా ఎక్కువ కాలం సాగలేదు. అనునిత్యం సీఎంలు మారుతూనే వచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సీఎంగా పని చేసిన నారాయణ్ దత్ తివారీ.. 1989లో యూపీలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పుడు సీఎంగా ఉన్నారు.

నాటి నుంచి యూపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. తాజాగా ఎస్పీతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం తహతహాలాడుతున్నది. గురువారం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో త్రిశంకు సభ ఏర్పడుందన్న అంచనాల మధ్య శనివారం మరోసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం..

తొలి సీఎం గోవింద్ వల్లబ్ పంత్

తొలి సీఎం గోవింద్ వల్లబ్ పంత్

1952లో తొలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఏర్పాటైనప్పుడు 346 స్థానాలకు అదనంగా 83 నియోజకవర్గాల్లో జంట సీట్లు కేటాయించారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 388 స్థానాల్లో విజయం సాధించింది. తొలి సీఎంగా పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 1954 వరకు కొనసాగారు. కేంద్ర హోంమంత్రిగా పంత్ ప్రమోషన్ పై హస్తినకు వెళ్లిన తర్వాత వారణాసికి చెందిన సంస్క్రుతి స్కాలర్ సంపూర్ణానంద్ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి 1957లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత 1960 వరకు సంపూర్ణానంద్ సీఎంగా కొనసాగారు. తర్వాత కమలాపాఠి త్రిపాఠి నుంచి సమస్యలు తలెత్తడంతో సంపూర్ణానంద్ స్థానే చంద్రబాను గుప్తా బాధ్యతలు స్వీకరించారు. తిరిగి 1963లో గుప్తాకు బదులు ఆచార్య జేబీ క్రుపాలానీ భార్య సుచేతా క్రుపాలానీ రాష్ట్ర తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

చరణ్ సింగ్ ఇలా సీఎం అయ్యారు..

చరణ్ సింగ్ ఇలా సీఎం అయ్యారు..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ బలం 199 స్థానాలకు పడిపోయింది. 425 స్థానాలు గల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సాధించేందుకు మరో 14 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం భారతీయ జన సంఘ్ 98 స్థానాలు గెలుచుకున్నది. సుచేతా క్రుపలానీ లోక్‌సభకు తరలి వెళ్లే కాగా మాజీ సీఎం చంద్రభాను గుప్తా.. రాణిఖేట్ అసెంబ్లీ స్థానం నుంచి 72 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ క్రాంతిదళ్ పార్టీ స్థాపించిన చరణ్ సింగ్.. ఛాప్రొలీ స్థానంలో 52 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

ఇలా లెఫ్ట్ టూ రైట్ మద్దతు

ఇలా లెఫ్ట్ టూ రైట్ మద్దతు

సోషలిస్టు నాయకులు రాం మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్‌లతోపాటు భారతీయ జన్ సంఘ్ కు చెందిన నానాజీ దేశ్ ముఖ్ తదితరులు 1967లో చరణ్ సింగ్ కు మద్దతు తెలిపింది. సంయుక్త విధాయక్ దళ్ (ఎస్వీడీ) సంకీర్ణ కూటమి తరఫున సీఎంగా చరణ్ సింగ్ ప్రమాణం చేశారు. నాడు సీపీఎం, బీజేఎస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, స్వతంత్ర పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీలతోపాటు 22 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు చరణ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.

అధికారం శక్తి తెలుసుకున్న జనసంఘ్

అధికారం శక్తి తెలుసుకున్న జనసంఘ్

దేశ రాజకీయాల్లో బారతీయ జన సంఘ్ (బీజెఎస్)కు అధికారం ఫలాలు చవిచూసేందుకు వచ్చిన తొలి అవకాశం. అయితే సీఎంగా చరణ్ సింగ్ బాధ్యతలు స్వీకరించే నాటికి రెండుసార్లు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, నలుగురు సీఎంల పాలనను చవి చూశారు. ఉత్తర భారత రైతులకు నాయకుడిగా ఎదిగిన చరణ్ సింగ్.. జాట్లు, యాదవ్‌లు, గుజ్జర్లు, కుర్మీలు తదితర సామాజిక వర్గాలతోపాటు ముస్లింల నుంచి విమర్శలు, సమస్యలు ఎదుర్కొన్నారు. ఎస్వీడీ మిత్రపక్షం సంయుక్త సోషలిస్టు పార్టీ (ఎస్సెస్పీ) అంగ్రేజీ హఠావో నినాదాన్ని చేపట్టడంతో ఇద్దరు క్యాబినెట్ మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశాక వారు రాజీనామా చేశారు. కొన్ని పార్టీలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1968 ఫిబ్రవరిలో సీఎంగా తన పదవికీ రాజీనామా చేసిన చరణ్ సింగ్ శాసనసభ రద్దుకు సిఫారసు చేశారు. ఏడాది కాలం రాష్ట్రపతి పాలన సాగిన తర్వాత 1969లో జరిగిన ఎన్నికల్లో చరణ్ సింగ్ సారథ్యంలోని బీకేడీ 98, జన్ సంఘ్ 49, కాంగ్రెస్ పార్టీ 211 స్థానాలను గెలుచుకున్నాయి. తిరిగి చంద్రభాను గుప్తా సీఎంగా పగ్గాలు చేపట్టినా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఏడాదిలోపే కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడంతో చంద్రబాను గుప్తా మైనారిటీలో పడిపోవడంతో పదవికి రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) సహకారంతో బీకేడీ నేత చరణ్ సింగ్ తిరిగి 1970 ఫిబ్రవరిలో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు

కమలాపాఠి త్రిపాఠితో విభేదాల వల్ల ఇలా..

కమలాపాఠి త్రిపాఠితో విభేదాల వల్ల ఇలా..

నెలల్లోపు తాజాగా తలెత్తిన సమస్యలతో కాంగ్రెస్ (ఆర్) పార్టీ నుంచి మంత్రివర్గంలో ఉన్న 14 మంది మంత్రులను రాజీనామా చేయాలని చరణ్ సింగ్ జారీ చేసిన ఆదేశాలు కమలాపాటి త్రిఫాఠి అమలు చేసేందుకు నిరాకరించారు. దీంతో సదరు 14 మంది మంత్రులకు ఉద్వాసన పలుకాలన్న చరణ్ సింగ్ అభ్యర్థనకు బదులు గవర్నర్ బెజవాడ గోపాల్ రెడ్డి. సీఎంగా తప్పుకోవాలని సూచించారు. తర్వాత కొద్ది నెలల రాష్ట్రపతి పాలన అమలైన కొద్ది కాలానికి మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ వ్యతిరేకులు కాంగ్రెస్ (ఒ) పార్టీ నాయకులంతా కలిసి సంయుక్త విధాయక్ దళ్ అధినేతగా త్రిభువన్ నారాయణ్ సింగ్ ను సీఎంగా నిలబెట్టారు. కానీ కేవలం ఐదు నెలలు మాత్రమే ఆయన ప్రభుత్వంలో కొనసాగారు. దేశ చరిత్రలో తొలిసారి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన సీఎంగా త్రిభువన్ నారాయణ్ సింగ్ నిలిచారు (1971 మార్చిలో గోరఖ్ పూర్ జిల్లాలోని మణిరం స్థానం నుంచి పోటీ చేశారు). ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.

1975లో తొలిసారి సీఎంగా ఎన్డీ తివారీ

1975లో తొలిసారి సీఎంగా ఎన్డీ తివారీ

త్రిభువన్ నారాయణ్ సింగ్ స్థానే పదవీ బాధ్యతలు చేపట్టిన కమలాపాటి త్రిపాఠి.. ప్రొవిషనల్ ఆర్ముడ్ కానిస్టేబుళ్లు మెరుగైన వేతనాల కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో 1973 జూన్ వరకు పదవిలో కొనసాగారు. ఈ ఉద్యమంతోనే పదవికి కమలపాఠి త్రిపాఠి రాజీనామా చేసిన తర్వాత కొద్ది నెలల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. కొద్ది నెలల రాష్ట్రపతి పాలన తర్వాత గర్హ్వాలీ బ్రాహ్మణుడు హేమవతి నందన్ బహుగుణ 1973 నవంబర్ లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ 1975 నవంబర్ లో సంజయ్ గాంధీతో విభేదాల వల్ల రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తనకు అత్యంత సన్నిహితుడైన ఎన్డీ తివారీకి సీఎం పదవి అప్పటించారు.

జనతా పార్టీ హయాంలో ఇద్దరు సీఎంలు

జనతా పార్టీ హయాంలో ఇద్దరు సీఎంలు

1977 ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్డీ తివారీ సారథ్యంలోని యూపీ సర్కార్ సహా పలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రద్దయ్యాయి. రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత 1977 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ 425 స్థానాలకు 352 స్థానాల్లో విజయం విజయం సాధించింది. చంద్రశేఖర్, లాల్ గంజ్ ఎంపీ రాంధన్ మధ్య సీఎం పదవి కోసం పోటీ పడింది. మధ్యేమార్గంగా యంగ్ టర్క్‌లు చరణ్ సింగ్, మధు లిమాయే గ్రూప్ నేతలు రాం బచన్ యాదవ్ ను సీఎంగా నిలబెట్టారు. ఈ ప్రభుత్వం 1977 జూన్ 1979 వరకు ఉన్నది. ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, ఎస్పీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యావ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రులు. డియోరియాలో పోలీసుల అక్రుత్యాల నేపథ్యంలో రాం నరేశ్ యాదవ్ రాజీనామా చేశారు. 1979లో వైశ్య సామాజిక వర్గ నేత బెనారసీ దాస్ సీఎంగా నియమితులైనా 1980లో ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు స్వీకరించాక దాస్ ప్రభుత్వాన్ని రద్దుచేశారు.

తివారీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ పతనం

తివారీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ పతనం

1980 నుంచి 1988 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరుగురు సీఎంలు మారారు. 1980లో కాంగ్రెస్ పార్టీ 309 స్థానాలు గెలుచుకున్న తర్వాత మండా రాజా వీపీ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని ఇందిరకు అత్యంత సన్నిహితుడన్న పేరు ఉన్నా వివిధ ఆరోపణల కారణంగా 1981లో పూలన్ దేవి చేతిలో 20 మంది రాజపుత్రుల ఊచకోత.. 1982లో వీపీ సింగ్ సోదరుడు జస్టిస్ చంద్రశేఖర్ ప్రతాప్ సింగ్ ను దొంగలు హత్య చేశాక రాజీనామా చేశారు. సుల్తాన్ పూర్ బ్రాహ్మణుడు శ్రీపాఠి మిశ్రా ఆయన స్థానే సీఎంగా బాద్యతలు స్వీకరించారు. రెండేళ్లు అధికారంలో ఉన్న మిశ్రా 1984 ఆగస్టులో ఉద్వాసనకు గురి కావడం మళ్లీ ఎన్డీ తివారీ సీఎంగా బాద్యతలు చేపట్టారు. తర్వాత ఇందిర దారుణ హత్య దరిమిలా జరిగిన ఎన్నికలకు తివారీ మళ్లీ సీఎంగా బాద్యతలు చేపట్టినా కాంగ్రెస్ సంస్క్రుతికి అనుగుణంగా కొద్ది నెలల్లోనే తివారీ స్థానే వీర్ బహదూర్ సింగ్ సీఎంగా 1985 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య పని చేశారు. ఆ తర్వాత తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తివారీ 1989లో పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసే వరకు సీఎంగా ఉన్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ యూపీలో కోలుకోలేదు.

1989లో తొలిసారి సీఎంగా ములాయం

1989లో తొలిసారి సీఎంగా ములాయం

1988లో ఏర్పాటైన జనతాదళ్ పార్టీలో చేరిన ములాయం సింగ్ యాదవ్, అజిత్ సింగ్ సీఎం పదవి కోసం పోటీ పడినా.. అజిత్ సహకారం, బీజేపీ బయటి మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1990 అక్టోబర్‌లో ఎల్ కే అద్వానీ రథయాత్రను నాటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకోవడంతో కేంద్రంలో వీపీ సింగ్, యూపీలో ములాయం పరభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. చంద్రశేఖర్ తో కలిసి ముందుకు సాగిన ములాయం సిగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొంత కాలం సీఎంగా కొనసాగడంతోపాటు ముస్లింల అనుకూల నేతగా ఆవిర్భవించారు. 1999లో రెండోసారి వాజ్ పేయి ప్రభుత్వం పతనమైన తర్వాత ములాయం తనకు తాను కాంగ్రెసేతర రాజకీయాలకు కీలకమైన శక్తిగా ఎదిగారు.

ఓబీసీ ములాయం వర్సెస్ ఓబీసీ కల్యాణ్ సింగ్

ఓబీసీ ములాయం వర్సెస్ ఓబీసీ కల్యాణ్ సింగ్

మండల్, మందిర్ రాజకీయాలు వచ్చిన తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో లోధ్ నాయకుడు కల్యాణ్ సింగ్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించింది. దీంతో ములాయం, కల్యాణ్ సింగ్ మధ్య పోరు సాగింది. 1991 ఎన్నికల్లో బీజేపీ 221 స్థానాలతో విజయం సాదించడంతో కల్యాణ్ సింగ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

బాబ్రీ మసీద్ కూల్చివేతతో కల్యాణ్ సర్కార్ ఔట్

బాబ్రీ మసీద్ కూల్చివేతతో కల్యాణ్ సర్కార్ ఔట్

బాబరీ మసీద్ కూల్చివేతతో కల్యాణ్ సింగ్ తోపాటు మధ్యప్రదేశ్ లోని సుందర్ లాల్ పట్వా, రాజస్థాన్ లోని బైరాన్ సింగ్ షెకావత్, హిమాచల్ లోని శాంతాకుమార్ ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసింది. 1993లో అగ్ర కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దళిత్ - ఓబీసీ కాంబినేషన్ పని చేసింది.

బీఎస్పీతో కలిసి ఎస్పీ 1992లో పోటీ

బీఎస్పీతో కలిసి ఎస్పీ 1992లో పోటీ

1992లో ఎస్పీ స్థాపించిన ములాయం అగ్రకులాల ఆధిపత్యానికి సవాల్ విసిరారు. 1992లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. రెండు పార్టీలు 109, 67 స్థానాల్లో విజయం సాదించాయి. 1995లో బీఎస్పీ వైదొలగడంతో ప్రబుత్వం మైనారిటీలో పడింది. మాయావతిపై గెస్ట్ హౌస్ లో కొందరు ఎస్పీ కార్యకర్తలు దాడి చేయడంతో రెండు పార్టీల మద్య వైరంగా మారింది.

1996 - 98 మధ్య పలువురు సీఎంలు

1996 - 98 మధ్య పలువురు సీఎంలు

1995లో తొలిసారి సీఎంగా మాయావతితో నాటి గవర్నర్ మోతీలాల్ ఓరా ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో 21 శాతం గల దళితులకు ఆమె ఆరాద్య దైవం అయ్యారు. 1996 - 98 మధ్య పలువురు సీఎంలు మారారు. 1996 ఎన్నికల్లో బీజేపీ 174 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో 1997 వరకు రాష్ట్రపతి పాలన సాగింది. 67 మంది ఎమ్మెల్యేలు గల బీఎస్పీతో ఒప్పందం కుదిరింది. తొలి ఆరు నెలలు సీఎంగా మాయావతి గద్దె నెక్కారు. తర్వాత ఆరు నెలలకు గద్దెనెక్కిన సీఎం కల్యాణ్ సింగ్ ఒప్పందం ప్రకారం పక్కకు తప్పుకోలేదు. మాయావతి మద్దతు ఉపసంహరించుకున్నా కాంగ్రెస్, బీఎస్పీలను బీజేపీ చీల్చి అధికారాన్ని కాపాడుకున్నది. 1998 ఫిబ్రవరి 21న లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా కల్యాణ్ సింగ్ స్థానే రాష్ట్ర గవర్నర్ రమేశ్ భండారీ.. జగదంబికా పాల్ తో సీఎంగా ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు తిరిగి కల్యాణ్ సింగ్ రెండు రోజుల తర్వాత సీఎంగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం జగదంబికా పాల్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. 1999లో కల్యాణ్ సింగ్ ప్రభ తగ్గి.. లోక్ సభలో బీజేపీ స్థానాలు 58 నుంచి 29కి పడిపోయాయి. ఫలితంగా రాజ్ నాథ్ సింగ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

2003లోనూ త్రిశంకు సభే

2003లోనూ త్రిశంకు సభే

సీఎంగా తప్పించడంతో కల్యాణ్ సింగ్ బీజేపీకి దూరమయ్యారు. ఓబీసీలకు దగ్గరయ్యేందుకు రాజ్ నాథ్ యత్నాలు విఫలమయ్యాయి. 2002లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందలేకపోయింది. బీజేపీ మద్దతుతో మాయావతి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 2003లోనే వైదొలగాల్సి వచ్చింది. బీజేపీలో అసమ్మతి వాదులు, బీఎస్పీలోని అసంత్రుప్తుల మద్దతుతో ములాయం 2003 ఆగస్టు నుంచి 2007 వరకు సీఎంగా ఉన్నారు.

సొంత బలంపై సీఎంగా మాయా

సొంత బలంపై సీఎంగా మాయా

2007 ఎన్నికల్లో బ్రాహ్మణ్ - దళిత్ - ముస్లిం కాంబినేషన్‌తో సొంత పార్టీకి పూర్తి మెజారిటీ రావడంతో మాయావతి నాలుగోసారి సీఎం అయ్యారు. అయితే ఆమె ఫార్ములాను బీఎస్పీ వ్యవస్థాపకుడు వ్యతిరేకించారు. 1991 తర్వాత తొలిసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత మాయాకే దక్కింది.

దేశంలోనే సీఎంగా అతి పిన్న వయస్కుడు అఖిలేశ్

దేశంలోనే సీఎంగా అతి పిన్న వయస్కుడు అఖిలేశ్

2012 ఎన్నికల్లో సీన్ రివర్సయింది. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం తనయుడు.. అఖిలేశ్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. బీజేపీ ఉమా భారతిని మధ్యప్రదేశ్ నుంచి యూపీ సీఎం అభ్యర్థిగా తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఎస్పీకి 425 స్థానాల్లో 224 స్తానాలు లభించాయి. ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేశ్ పట్ల పుత్ర వాత్సల్యంతో సీఎంగా పగ్గాలు అప్పగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+