వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: స్కూళ్లు మూసివేత -పరీక్షలు లేని విద్యా సంస్థలన్నీ కూడా -యోగి సర్కార్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గతంలో మాదిరిగానే మహమ్మారి దెబ్బ ముందుగా విద్యా రంగపైనే పడింది. అసలే విద్యా సంవత్సరం కోల్పోయి, అరకొరగా పాఠాలు సాగుతున్నాయనగా, సెకండ్ వేవ్ ఉధృతి వల్ల బడులు మళ్లీ మూతపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్కూళ్ల మూసివేత దిశగా వెళుతుండగా, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఏకంగా ఆదేశాలు కూడా జారీ చేసింది.

 షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా

ఉత్తరప్రదేశ్ లో ఎనిమిదో తరగతి లోపు విద్యార్థులు ఈనెల 24 నుంచి 31 దాకా ఎవరూ స్కూళ్లకు రావొద్దని, ఆయా తరగతుల వారికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నట్లు యోగి సర్కార్ సోమవారం రాత్రి ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం పరీక్షల షెడ్యూల్ లేని ఇతర విద్యా సంస్థలన్నిటినీ కూడా బుధవారం నుంచి మూసేయాలని ఆదేశించింది.

Uttar Pradesh schools up to class 8 to remain closed till March 31 amid spike in COVID-19 cases

అసలే విద్యా ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉండే ఉత్తరప్రదేశ్ లో సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత గత నెలలోనే స్కూళ్లు తెరుచుకున్నాయి. 9, 10వ తరగతి వారికి ఆన్ లైన్ పాఠాలు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 10 నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. నెల తిరక్కముందే కరోనా మళ్లీ పెరగడంతో మూసివేత తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ

యూపీలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే 8,759 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6,08, 076కేసులు నమోదుకాగా, అందులో5,95,743 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,036 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసేశారు. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం ఛండీగఢ్ లోనూ మార్చి 31 వరకు 8వ తరగతి లోపు పిల్లకు స్కూళ్లు మూసేస్తూ అక్కడి యంత్రాంగం ఆదేశాలిచ్చింది.

English summary
The Uttar Pradesh government led by Chief Minister Yogi Adityanath has decided to shut all schools for students up to class 8 from March 24 March till March 3 amid a massive surge in the COVID-19 cases across the state. The announcement in this regard was made late on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X