వాళ్లను రేప్ చేయడమే ఆ టీచర్ పని.. 65 వీడియోలు లభ్యం.. షాకింగ్ నిజాలు..
ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చాడు ఆ కీచక టీచర్. పాఠాలు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులతో లైంగిక వాంఛ తీర్చుకుని ఆ దృశ్యాలను వీడియోల్లో బంధించాడు. వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ తన కామ వాంఛను తీర్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. 72 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు.
ఏం జరిగిందంటే..?
పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే పాడు పనులు చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చోటు చేసుకుంది. హథ్రాస్ లోని సేత్ పుల్ చంద్ బాగ్లా కాలేజీ లో జాగ్రఫీ ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న 50 ఏళ్ల రాజ్ నీష్ కుమార్.. కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరీక్షల్లో మార్కులు అధికంగా వేస్తానని మాయ మాటలు చెప్పి స్టూడెంట్స్ ను లోబర్చుకున్నాడు. అలా వాళ్లపై లైంగిక దాడి జరిపి ఆ దృశ్యాలను పెన్ కెమెరా ద్వారా రికార్డు చేశాడు. మళ్లీ ఆ వీడియోలు సదరు స్టూడెంట్స్ కు చూపించి వారిని లోబరచుకుని పదేపదే వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 72 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ జరిపి రాజ్ నీష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. విచారణలో విస్తుపోయో నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతడు 2008 నుంచే అదే కాలేజీలో అనేక మంది స్టూడెంట్స్ పై లైంగికంగా వేధింపులు జరిపాడు. వీడియోలతో బెదిరించి తన కామ వాంఛ తీర్చుకున్నాడు. అతడి మొబైల్ ఫోన్ నుంచి దాదాపు 65 వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications