UP: అన్ని జిల్లాల్లో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని యూపీ సర్కార్ నిర్ణయం..
నవరాత్రి ఉత్సవాలకు యూపీ సర్కార్ నిధులు కేటాయించింది.
రాబోయే నవరాత్రి పండుగ, శ్రీ రామనవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో రామాయణ. దుర్గా సప్తశతి పారాయణాలను నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ. 1 లక్ష మొత్తాన్ని కేటాయించింది. ఈ మేరకు జిల్లాకు చెందిన జిల్లా మేజిస్ట్రేట్‌లు, డివిజనల్ కమీషనర్‌లకు లేఖలు కూడా రాసింది. నవరాత్రుల్లో యూపీలోని అన్ని శక్తిపీఠాలు, దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జిల్లా, తహసీల్, బ్లాక్ స్థాయిలలో ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మార్చి 21 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమాలు జరిగే ఆలయాల పేర్లు, చిరునామాలతో పాటు ఫోటోలు, ఫోన్ నంబర్లను సమర్పించాలని అధికారులను కోరారు. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇద్దరు నోడల్ అధికారులను కూడా నియమించారు.

ఈ కార్యక్రమాలు మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగుస్తాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లకు సంబంధించి ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా పాలనాధికారులను ఆదేశించినట్లు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మేష్రామ్ తెలిపారు. కొవిడ్ -19 మహమ్మారికి ముందు చైత్ర మాసంలో నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించామని అసిస్టెంట్ డైరెక్టర్ (కల్చర్) రంగభారతి తెలిపారు.












Click it and Unblock the Notifications