Yogi Adityanath: ఓబీసీ రిజర్వేషన్‍పై సుప్రీం తీర్పును స్వాగతించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..
ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది. సుప్రీం నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "గౌరవనీయమైన సుప్రీంకోర్టు OBC కమిషన్ నివేదికను ఆమోదించడం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఆదేశాలను స్వాగతిస్తున్నాము. UP ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి కట్టుబడి ఉంది" అని ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ వెనుకబడిన తరగతుల నివేదిక ప్రకారం ఓబీసీ కోటాతో కలిపి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సోమవారం మార్గం సుగమం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం జనవరి 4, 2023 నాటి ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది.

డిసెంబర్ 2022లో ఉత్తరప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మార్చి 9, 2023న నివేదికను మంత్రివర్గానికి సమర్పించినట్లు సొలిసిటర్ జనరల్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లకు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు జనవరి 4న ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.












Click it and Unblock the Notifications