కాంగ్రెస్ ఘోర పరాజయం, బీజేపీ సునామీ, రెండుచోట్లా ఓడిన సీఎం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. 70 స్థానాలు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. 2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. . 70 స్థానాలు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ 50 స్థానాలకు పైగా గెలుచుకుంటోంది. ఇప్పటి దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, సీఎం హరీష్ రావత్‌ను ప్రజలు తిప్పికొట్టారు.
- బీజేపీకి 55, కాంగ్రెస్‍కు 11, ఇతరులు నాలుగు సీట్లు గెలిచారు.
- మధ్యాహ్నం మూడు గంటలకు రావత్ రాజీనామా చేస్తారు.
- ఉత్తర ప్రదేశ్ సీఎం హరీష్ రావత్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడారు. ఆయన హరిద్వార్ (రూరల్), కిచ్చల నుంచి పోటీ చేశారు. ఈ రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోయారు.
- ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఓడిపోయారు.
- పది గంటల సమయానికి బీజేపీ 51, కాంగ్రెస్ 16 స్థానాల్లో ముందంజలో ఉంది.
- తొమ్మిదింపావు సమయానికి ఉత్తరాఖండ్‌లో బీజేపీ 37, కాంగ్రెస్ 17, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
- హరీష్ రావత్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నట్లుగా ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతోంది.
- తొమ్మిది గంటల సమయానికి బీజేపీ 22, కాంగ్రెస్ 10 స్థానాల్లో ముందంజలో ఉంది.
- ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వెనుకంజలో ఉన్నారు.
- ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్ నిషేధించారు.
- మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తున్నారు.
- ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.
- ఓట్ల లెక్కింపుకోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
- ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు

2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది. విభజనతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత కాంగ్రెస్, రెండోసారి బీజేపీ పాలించాయి. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పాలనలో ఉంది. హరీష్ రావత్ సీఎం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదని ఈ పర్వత రాష్ట్రం బీజేపీ వైపు మొగ్గు చూపిందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి.
70 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఉత్తరాఖండ్‌లో మేజిక్ ఫిగర్ 36. యూపీ తర్వాత బీజేపీ ఉత్తరాఖండ్ పైన కూడా ఎక్కువ దృష్టి సారించింది. బీజేపీని, మోడీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్.. తమ సీఎం హరీష్ రావత్‌ను బాహుబలిగా ప్రచారం చేసింది. ఇది అందర్నీ ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications