Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి సమన్లు, ఎందుకంటే...?

ఎంఏల్ఏల కొనుగోలు వ్యవహరంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హారీష్ రావత్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది డిసెంబర్ 26వ, తేది లోపుగా తమ ముందు హజరుకావాలని సిబిఐ సమన్లను పంపింది.

ఉత్తరాఖండ్ :ఎంఏల్ఏల కొనుగోలు వ్యవహరంలో ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్ సిబిఐ మరో సారి సమన్లను జారీ చేసింది.గత ఏడాదిలో ఎంఏల్ఏల కొనుగోలు వ్యవహరంపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఉత్తరాఖండ్ లో రాజకీయంగా దుమారాన్ని రేపింది.

విశ్వాస పరీక్ష సందర్భంగా ఎంఏల్ఏల కొనుగోలు కోసం ప్రయత్నించారనే ఆరోపణలు హారీష్ రావత్ పై వచ్చాయి. ఎంఏల్ఏల కొనుగోలుకు సంబందించి ఆయనపై స్టింగ్ ఆపరేషన్ బయటపడింది. ఈ ఆపరేషన్ కు సంబందించి సిబిఐ ఆయనకు సమన్లు జారీ చేసింది.

uttarakhand cm harish rawat gets cbi summons

ఈ కేసులో డిసెంబర్ 26వ, తేదిన హాజరుకావాలని ఆయనను సిబిఐ ఆదేశించింది.అసంతృప్త ఎంఏల్ఏలను బుజ్జగించేందుకు బిజెపిలోని కొంతమంది ఎంఏల్ఏలను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి.

తనకు వ్యతిరేకంగా ఉన్న ఎంఏల్ఏలను ,బిజెపి ఎంఏల్ఏలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి హారీష్ రావత్ మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో , వీడియో టేపుల ఘటన వివాదానికి కారణమైంది. సిఎం తమకు డబ్బులిస్తారని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని కొందరు రెబెల్ ఎంఏల్ఏలు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అయితే దీనిపై సిబిఐ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే సిబిఐ హరీష్ రావత్ కు డిసెంబర్ 26వ, తేదిన హజరుకావాలని కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+