వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ విచారణ ఆపండి: హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సీఎం..!

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు నైనితాల్ హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ త్రివేంద్ర సింగ్ రావత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు జర్నలిస్టులు ఉమేష్ శర్మ, శివప్రసాద్ సెమ్వాల్‌లు సీఎం తివేంద్ర సింగ్ రావత్‌పై వేర్వేరు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. ఇద్దరి జర్నలిస్టులపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా కోరుతూ వీరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ అదే సమయంలో సీఎం రావత్‌పై సీబీఐ ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.

సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్‌లో బీజేపీ నేతలు... సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్‌లో బీజేపీ నేతలు...

ఉమేశ్ కుమార్ శర్మ,శివప్రసాద్ శర్మ అనే ఇద్దరు జర్నలిస్టులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయస్థానంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి అవినీతిని బయటపెట్టినందుకే డెహ్రాడూన్ పరిధిలోని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్‌లో తమపై ఎఫ్ఐఆర్ నమోదైందని... తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బంధువేనని రిట్ పిటిషన్‌లో ఆరోపించారు. డెహ్రాడూన్ లోని ఓ కాలేజీ మేనేజర్ అయిన హరీందర్ సింగ్ రావత్ తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని... ఆయన సీఎం రావత్ చెల్లెలి భర్త అని పేర్కొన్నారు.

Uttarakhand CM Trivendra Singh Rawat Knocks SC door against HC order for CBI probe into graft charges

Recommended Video

India-Nepal Relations మీద Rajnath Singh కామెంట్లు,భారత భూ భాగాలతో ఉన్నNepal Map ను ఒప్పుకున్నట్టేనా?

జర్నలిస్ట్ ఉమేశ్ కుమార్ శర్మ ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ వీడియోని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో గో సేవా ప్యానెల్‌ ఛైర్‌పర్సన్ పదవి కోసం ఓ వ్యక్తి ముఖ్యమంత్రికి లంచం ఇచ్చారని ఉమేశ్ కుమార్ అందులో ఆరోపించారు. ఆ లంచం డబ్బులను సదరు వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు సవితా రావత్,ఆమె భర్త హరీందర్ సింగ్ రావత్ బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించారని ఆరోపించారు. ఆ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు డాక్యుమెంట్స్ కూడా బయటపెట్టారు.

English summary
Uttarakhand CM Trivendra Singh Rawat had approached the Supreme Court seeking stay on CBI probe on the orders of Nainital HC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X