వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్‌ విపత్తు: 14 మృతదేహాలు వెలికితీత-ధ్వంసమైన పవర్ ప్రాజెక్టులు

|
Google Oneindia TeluguNews

డెహ్రాడున్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నందాదేవి నేషనల్ పార్క్‌ కోర్ జోన్‌లో గ్లేసియర్ విరిగిపడ్డాయి. ఫలితంగా ఈ రెండు నదలు ఉప్పొంగాయి.. మహోగ్ర రూపాన్ని దాల్చాయి. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దీనితో తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది. ఈ ఘటనలో వందలాది మంది కొట్టుకుని పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

Recommended Video

    #Uttarakhand ఉత్తరాఖండ్ వరద బీభత్సం.. 100 మందికి పైగా మృతి
    Uttarakhand Flash flood live updates:100 to 150 casualities feared in flash flood

    ప్రాథమికంగా 300 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వారిలో పలువురు కార్మికులు ఉన్నారు. వారంతా తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను చేపట్టాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం

    Newest First Oldest First
    12:39 AM, 9 Feb

    వరదల కారణంగా నిరాశ్రయులైన గ్రామస్తులకు నిత్యావసరాలను అందజేస్తున్న సహాయక బృందాలు.
    11:01 PM, 8 Feb

    సోమవారం రాత్రి కూడా టన్నెల్‌లో సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఐటీబీపీ సిబ్బంది.
    9:44 PM, 8 Feb

    అధికారులతో సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సమీక్ష
    7:35 PM, 8 Feb

    వరదలతో టన్నెల్‌లోకి చేరిన నీరు, మిషన్లలో గల నీటిని బయటకు పంపిన సిబ్బంది
    7:05 PM, 8 Feb

    ఉత్తరాఖండ్ వరద బీభత్సంతో కొట్టుకుపోయిన బ్రిడ్జీ
    6:57 PM, 8 Feb

    టన్నెల్‌లో కొనసాగుతోన్న సహాయక చర్యలు
    5:54 PM, 8 Feb

    ఉత్తరాఖండ్ విపత్తుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి రూ.20 కోట్లు విడుదల చేసిన సీఎం
    5:24 PM, 8 Feb

    ఉత్తరాఖండ్ విపత్తుపై ఆ రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై చర్చించిన ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
    4:08 PM, 8 Feb

    వరద ధాటికి నష్టపోయిన గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్న ఐటీబీపీ. అవసరమైన సామగ్రిని గ్రామాలకు చేరవేస్తున్న ఐటీబీపీ సిబ్బంది
    4:07 PM, 8 Feb

    వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న హెలికాఫ్టర్. ఘటనా స్థలం ఏరియల్ వ్యూ
    1:48 PM, 8 Feb

    ఉత్తరాఖండ్ విపత్తుపై బ్రిటన్ ప్రధాని ట్వీట్. ఈ కష్ట సమయంలో తామంతా భారత్ వైపు ఉన్నామంటూ ధైర్యం ఇచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది సేవలను కొనియాడిన బ్రిటన్ ప్రధాని. అవసరమైతే బ్రిటన్ సహాయం చేసేందుకు ముందుంటుందని గుర్తుచేసిన ప్రధాని జాన్సన్
    1:46 PM, 8 Feb

    తపోవన్ వద్ద సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్న ఐటీబీపీ సిబ్బంది
    1:45 PM, 8 Feb

    ఉదయం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో పాల్గొంటోంది. ఇప్పటి వరకు డెహ్రాడూన్ నుంచి జోషిమఠ్‌కు 122 మంది సిబ్బందిని 5 టన్నుల సామగ్రిని, ఆరు పోలీసు జాగిలాలను తరలించాం: ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్
    1:42 PM, 8 Feb

    తపోవన్ వద్ద పోలీసు జాగిలాలను ఉంచాం. ఎవరైనా కింద కూరుకునిపోయి ఉంటే ఈ శునకాలు గుర్తించగలవు: ఐటీబీపీ
    1:11 PM, 8 Feb

    ఉత్తరాఖండ్ వరదలపై సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటన. ఇప్పటి వరకు 203 మంది గల్లంతయ్యారు: సీఎం రావత్
    12:21 PM, 8 Feb

    ఇంకా 143 మంది ఆచూకీ కనిపించలేదు: ఉత్తరాఖండ్ డీజీపీ
    12:20 PM, 8 Feb

    తపోవన్ పవర్ ప్రాజెక్టు వద్ద టనెల్‌లో సహాయక చర్యలు చేపడుతున్నాం:డీజీ, ఎన్డీఆర్ఎఫ్
    11:35 AM, 8 Feb

    ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీయగా.. మరో 170 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది
    11:34 AM, 8 Feb

    వరదల ధాటికి నామరూపాలు లేకుండా పోయిన రేణి వద్ద విద్యుత్ కేంద్రం
    11:32 AM, 8 Feb

    ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరదల్లో గల్లంతైన వారికోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన జమ్మూ కశ్మీర్ స్కూలు విద్యార్థులు
    11:01 AM, 8 Feb

    ఉత్తరాఖండ్

    ఉత్తరాఖండ్ ఉత్పాతంలో 203 మంది వరకు గల్లంతైనట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడి. 35 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపిన ముఖ్యమంత్రి.
    10:46 AM, 8 Feb

    ఉత్తరాఖండ్

    ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ కేంద్రం టన్నెల్‌‌‌లో కనిపించిన దృశ్యాలు. వరద పోటెత్తడంతో ఈ సొరంగాన్ని బురద కప్పేసింది. ఆర్మీ, ఐటీబీపీ జవాన్లు ఈ టన్నెల్‌ను క్లియర్ చేశారు
    10:37 AM, 8 Feb

    ఉత్తరాఖండ్

    ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ కేంద్రం టన్నెల్‌‌ క్లియరింగ్‌ను చేపట్టిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు.
    10:33 AM, 8 Feb

    ఉత్తరాఖండ్

    ఉత్తరాఖండ్ గ్లేసియర్ ఘటనలో మృతదేహాలు దిగువకు ప్రవహించి ఉండొచ్చనే అనుమానంతో పౌరీ ఘర్వాల్ జిల్లాలోని శ్రీనగర్ డ్యామ్‌లో గాలింపు చర్యలను చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, పోలీసులు.
    10:01 AM, 8 Feb

    ఉత్తరాఖండ్

    ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొనసాగుతోన్న సహాయక చర్యలు. హైడల్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి 12 మంది కార్మికులను రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బలగాలు. మరో సొరంగంలో కొనసాగుతోన్న గాలింపు చర్యలు
    12:04 AM, 8 Feb

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలి జిల్లాలో భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 170 మంది కార్మికులు, ప్రజలు ధౌలిగంగా, అలకనంద నదీ ప్రవాహంలో గల్లంతైనట్లు వెల్లడించారు.
    10:48 PM, 7 Feb

    వదర ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
    10:29 PM, 7 Feb

    వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు డెహ్రాడూన్ చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
    9:30 PM, 7 Feb

    కొండచరియలు ఎలా విరిగిపడ్డాయి, ఆకస్మిక వరదలకు కారణాలను నిపుణులు వెల్లడిస్తారని.. ప్రస్తుతం తాము వరదల్లో చిక్కుకున్నవారి ప్రాణాలను కాపాడటంపైనే దృష్టి సారించామని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు.
    8:07 PM, 7 Feb

    వరదల ఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు చేపడుతున్న ఐటీబీపీ బృందాలు.
    READ MORE

    English summary
    Glacial burst in Uttarakhand's Chamoli leads to flash flood, alert sounded till Haridwar. The water level in Dhauliganga river rose suddenly following an avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X