ఉత్తరాఖండ్ జల విషాదం: 32కు చేరిన మృతుల సంఖ్య, మరో 197 మందికి కొనసాగుతున్న రెస్క్యూ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఛమోలి జిల్లాలోని ధౌలిగంగా, అలకనంద నదుల వరదల్లో చిక్కుకున్నవారి కోసం మంగళవారం రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి సహాయక బృందాలు. ఆదివారం సంభవించిన ఈ జల విలయంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 32 మందిని వెలికితీశారు.
ఇప్పటికీ కానరాని 197 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. భారీ వరదల కారణంగా 480 వాట్ల ఎన్టీపీసీ తపోవన్-విష్ణుగడ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. 13.2 మెగావాట్ల రిషిగంగా హైడల్ ప్రాజెక్టు కూడా ఈ వరదలతో భారీగా దెబ్బతింది. నదీ పరివాహక గ్రామాల్లోని పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

సుమారు 600 మందికిపైగా భారత సైనికులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఛమోలి జిల్లాలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న పలు గ్రామాల ప్రజలకు ఐటీబీపీ నిత్యావసర సరుకులను అందించడం పట్ల ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
5-6 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఐటీబీపీ జవాన్లు నడిచివెళ్లి వరద బాధిత ప్రజలకు నిత్యావసర వస్తువులు, మందులు, ఇతర వస్తువులను అందజేయడాన్ని తాను స్వయంగా చూసినట్లు సీఎం రావత్ తెలిపారు.
కాగా, 2.5 కిలోమీటర్ల మేర పొడవున్న టన్నెల్‌లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 35 మంది వరకు ఆ టన్నెల్‌లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఆదివారం నుంచి మంగళవారం రాత్రి వరకు కూడా నిరంతరాయంగా సహాయక బృందాలు చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు శ్రమిస్తున్నాయి.
సహాయక చర్యలపై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. టన్నెల్‌లో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని చెప్పారు.
కొండచరియలు, హిమానీనదాలు విరిగిపడటంతోనే ఒక్కసారిగా నదులు పొంగిపొర్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications