కేబుల్ కార్ స్ట్రక్: 60 మంది పర్యాటకులు, బీజేపీ ఎమ్మెల్యే కూడా.. సేఫ్
ఉత్తరాఖండ్‌లో ఓ కేబుల్ కార్ సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. ఆ సమయంలో 60 మంది అందులో ఉన్నారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. దాదాపు వారు 45 నిమిషాలు గాలిలోనే ఉన్నారు. ఈ ఘటన తెహ్రి జిల్లా సుర్ఖాండ దేవి ఆలయం వద్ద జరిగింది. తర్వాత వారందరినీ సురక్షితంగా కిందకి దించారు. అందరినీ రోప్ వే ద్వారా కిందకు దించామని తెహ్రి గర్హ్వాల్ ఎస్ఎస్పీ నవనీత్ బుల్లార్ తెలిపారు.
రోప్ వే ఆగిపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చాలా సీరియస్ అంశం అని పేర్కొన్నారు. ఎవరీ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టకూడదని అన్నారు. ఘటన గురించి ఆపరేటర్, సంబంధిత అధికారులతో చర్చిస్తానని తెలిపారు.

ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో కూడా జరిగింది. మే నెలలో సాత్నా జిల్లా మైహర్ పట్టణంలో శార్దా ఆలయం వద్ద జరిగింది. కేబుల్ కారులో వారు నిలిచి పోయిన తర్వాత గంట తర్వాత సహాయక చర్యలు చేపట్టారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సొలాన్ జిల్లా పర్వాను వద్ద కూడా 11 మంది చిక్కుకున్నారు. అయితే వారు 6 గంటల పాటు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది.
#Tehri-#Surkanda #Devi #Temple #ropeway #stopped
— Shiv Kumar Maurya (@ShivKum60592848) July 10, 2022
About 60 to 70 #people #Trapped in the ropeway
Tehri #MLA #KishoreUpadhyay also #Trapped in #trolley
Due to #technical #reason, the rope stopped suddenly in the middle.#Uttarakhand pic.twitter.com/iIzM4CfO9g












Click it and Unblock the Notifications