వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ ఫలితాలు: కాంగ్రెస్ కు 48సీట్లు: హరీష్ రావత్; గెలుపు బీజేపీదే: పుష్కర్ సింగ్ ధామి

|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరఖండ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. పార్టీల రాజకీయ భవితవ్యం తేలే నిర్ణయం నేడే వెలువడనుండడంతో రాజకీయ పార్టీలలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి వారు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.

Recommended Video

Election Results 2022 : BJP Lead In Three States | Oneindia Telugu
కాంగ్రెస్ కు 48 సీట్లు వస్తాయి: హరీష్ రావత్

కాంగ్రెస్ కు 48 సీట్లు వస్తాయి: హరీష్ రావత్

కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట్లాడుతూ, ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని, 70 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ దాదాపు 48 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. వచ్చే 2-3 గంటల్లో అంతా తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలపై నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ 48 స్థానాలకు చేరువవుతుందని తాను నమ్ముతున్నాను అని రావత్ అన్నారు.

 ఉత్తరాఖండ్ లో హంగ్ అసెంబ్లీకి ఛాన్స్ .. ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించే ఛాన్స్

ఉత్తరాఖండ్ లో హంగ్ అసెంబ్లీకి ఛాన్స్ .. ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించే ఛాన్స్

ఉత్తరాఖండ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ పార్టీ వంటి పార్టీలకు ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పెద్ద పాత్ర పోషించే అవకాశాన్ని పెంచుతుంది. 60 స్థానాలకు గాను 40 నుంచి 45 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు నేరుగా పోటీ పడుతుండగా, ప్రాంతీయ పార్టీలు 25-30 స్థానాల్లో త్రిముఖ పోరు సాగించాయి.

 విజయం తమదే అంటున్న బీజేపీ సీఎం పుష్కర్ సింగ్ ధామి

విజయం తమదే అంటున్న బీజేపీ సీఎం పుష్కర్ సింగ్ ధామి


మరోవైపు అధికార బీజేపీ కూడా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దాని కంటే పార్టీ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని, అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎగ్జిట్ పోల్స్ ఉత్తరాఖండ్‌లో మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయని చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే మా వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉంటుందని పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. పార్టీ మెజారిటీ సాధిస్తుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. చేసిన పనికి ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారని కచ్చితంగా ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

English summary
Congress leader Harish Rawat said the victory would be 48 seats for the Congress. BJP Pushkar Singh Dhami says victory in this election is ours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X