Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రంలో 'గ్రీన్ సెస్' విధింపు.. అన్ని వాహనాలపై అదనపు ఫీజు..!

రాష్ట్రంలోని పర్యావరణాన్ని కాపాడేందుకు ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణాన్ని కాపాడి.. రాష్ట్రంలో కాలుష్యాన్ని నిర్మూలించేందుకు గ్రీన్ సెస్ ను విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ లోకి ప్రవేశించే ప్రతి వాహనంపై గ్రీన్ సెస్ ను విధించనుంది. గ్రీన్ సెస్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని చెట్లను పెంచడం కోసం వినియోగించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం ద్వారా గాలి నాణ్యత పెరగడం, ఎకో- ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాలకు ఫండింగ్ చేయడం, కాలుష్యం తగ్గిపోవడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

దేవ భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. నూతన పర్యావరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రీన్ సెస్ ను తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతోపాటుగా రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ లోకి ప్రవేశించే అన్ని వాహనాలపై గ్రీన్ సెస్ ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర ఎకో- ఫ్రెండ్లీ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.

Uttarakhand s Eco-Tax Debut CM Dhami Imposes Green Cess on Out-of-State Vehicles

గ్రీన్ సెస్ నుంచి వచ్చిన ఆదాయంతో గ్రీన్ ప్రాజెక్ట్స్ కు ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కోసం వినియోగించనుంది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో వాయి కాలుష్యం అధికమవుతున్న నేపథ్యంలో గ్రీన్ సెస్ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

గ్రీన్ సెస్ అమల్లోకి వస్తే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ వాయు సురక్షన్-2024 ర్యాంకింగ్స్ లో రిషీకేష్ 14వ స్థానంలో అలాగే డెహ్రాడూన్ 19 వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ సెస్ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా రూ. 100 కోట్లు సమకూరుతాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+