Uttarkhand exit polls: గెలుపు బీజేపీదని ఇండియాటూడే, కాంగ్రెస్‌దని ఏబీపీ సీఓటర్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా.. మరికొన్ని మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని చెబుతున్నాయి. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడంతో పలు వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు సోమవారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
ఏబీపీ సీ ఓటర్ ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్:
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం..
బీజేపీకి 26-32 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 32-38 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-02 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఇండియాటూడే ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్:
ఇండియా టూడే మాత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి బీజేపీనే వస్తుందని వెల్లడించింది. ఇండియా టూడే అంచనాల ప్రకారం..
బీజేపీకి 36-46 స్థానాలు
బీఎస్పీకి 20-30 సీట్లు
బీఎస్పీకి 2-4 స్థానాలు
ఇతరులకు 2-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
టూడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్:
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందని టూడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
బీజేపీ కూటమికి 43 సీట్లు
కాంగ్రెస్ కూటమికి 24 సీట్లు
ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్:
జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొంత పోటీ ఉన్నట్లు అంచనా వేసింది. అయితే, బీజేపీకే అధికారం నిలుపుకునేందుకు అవకాశాలున్నాయని తెలిపింది.
బీజేపీకి 32-41 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 35-27
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-1 స్థానం
ఇతరులకు 0-3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి టైమ్స్ నౌ వీటో ఎగ్జిట్ పోల్స్ గమనించినట్లయితే..
మరోసారి బీజేపీనే అధికారాన్ని చేపడుతుందని తేల్చాయి.
బీజేపీకి 37 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 31 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 01 సీటు
ఇతరులకు 01 స్థానం
రిపబ్లిక్-పీ మార్క్యూ ఎగ్జిట్ పోల్స్:
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రిపబ్లిక్-పీ మార్క్యూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనించినట్లయితే..
బీజేపీకి 35-39 స్థానాలు
కాంగ్రెస్ పార్టీకి 28-34 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-3 సీట్లు
ఇతరులు: 0-3 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయని తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థాలున్నాయి. కాగా, మార్చి 10న అసలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications